Anchor Vishnupriya : యాంకర్ విష్ణుప్రియ.. బుల్లితెరపై ఈ బ్యూటీ చాలా ఫేమస్. పోవే పోరా అనే షో ద్వారా ఈ భామ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. కొన్నిసార్లు జబర్దస్త్ స్కిట్లలోనూ మెరిసింది. ఈ బ్యూటీ ముక్కు చాలా ఫేమస్. జబర్దస్త్ స్కిట్లలో ఈ భామ ముక్కుపై కమెడియన్లు తెగ పంచ్‌లు వేసేవారు. నెమ్మదిగా ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీకి వరుస ఈవెంట్లు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సినిమాలు, సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంది.

రీసెంట్గా వచ్చిన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ సినిమాలో అందాలు ఆరబోసి హాట్ టాపిక్ అయింది. అంతకు ముందు ఓ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించినా ఆ మూవీ రిలీజ్ కాలేదు. ఇక యాంకర్ విష్ణుప్రియ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. తన ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో ఈ భామ ఫొటోలు చూసి కుర్రకారు మతిచెడిపోతోంది. ఈ భామకు సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. అందుకే ఈమె ఫేస్ బుక్ ఖాతాలో 3.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

మొన్నామధ్య తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయినట్టు చెప్పుకొచ్చిన విష్ణు ప్రియ. తన ఫేస్ బుక్ పేజీలో అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్ట్ అవుతున్నాయని దయచేసి కొన్ని రోజులు తనని అన్ ఫాలో చేయమని చెప్పుకొచ్చింది. కొన్నిరోజుల తర్వాత అంతా సెట్ అయిందనుకుంటే మళ్లీ రీసెంట్గా ఈ బ్యూటీ ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందట. విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్లో అశ్లీల వీడియోలు కనిపిస్తున్నాయట. ఆ వీడియోలు చూసి ఆమె బంధువులు, స్నేహితులు ఆమెకు తెగ ఫోన్లు చేస్తున్నారట.
“చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ నాకు కాల్ చేసి మరీ నీ ఫేస్బుక్లో ఆ వీడియోలేంటి ఆ కంటెంట్ ఏంటని అంటున్నారు. అవి నేను పోస్ట్ చేసినవి కావు. వాటికి నాకు ఎంత మాత్రం సంబంధం లేదు…” అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. ఆమె ఫేస్బుక్లో ఇప్పటికీ అశ్లీల వీడియోలు పోస్ట్ అవుతూనే ఉన్నాయట. అప్పటి నుంచి ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.
ఇలాంటి అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు వస్తున్నా విష్ణుప్రియ.. సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించడం కానీ.. ఆ పేజ్‌ని డిలీట్ చేయించడం కానీ చేయలేదు. దీంతో ఆమె కావాలనే పోస్ట్ చేసి నాకు సంబంధం లేదు అన్నట్టు నటిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.