Anchor Anasuya : బుల్లితెర అందాల యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన గ్లామర్, మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. పలు టీవీ షోలలో యాంకర్ గా చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో అనసూయ యమ యాక్టివ్ గా ఉంటుంది తరచూ ఏదో ఒక పోస్ట్ తో తన అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది..
తాజాగా అనసూయ పర్పుల్ కలర్ డ్రెస్ లో తలుక్కుమనింది.. ఈ ఫొటోస్ షూట్లో రకరకాల స్టిల్స్ ఇస్తూ కుర్ర కారుని కవ్వించింది.. ఒక వైపు కన్ను గీటుతూనే ముద్దిస్తూ మతిపోగొట్టేసింది.. డెనిమ్ జీన్స్ లో పర్పుల్ కలర్ టాప్ లో అందమైన నవ్వులు నవ్వుతూ కుర్ర కారు గుండెలను చెదరగొట్టింది.. అనసూయ విజయవాడలో ఓ ఈవెంట్ లో పాల్గొంటున్నానని.. ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు అంటూ అనసూయ షేర్ చేయగా ప్రస్తుతం ఆ క్లిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమా రంగంలో కూడా అడుగు పెట్టింది. మంచి మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ వెండి తెర మీద కూడా తన సత్తా చూపించింది.. అనసూయ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా బాగా కలిసి వచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకులు దగ్గర మంచి మార్కులే కొట్టేసింది. ఇటీవల పాన్ ఇండియా చిత్రం పుష్పా సినిమాలో కూడా దాక్షాయిని పాత్రలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించింది తనేంటో ప్రతిసారి నిరూపించుకుంటుంది.