Sreeleela .. టాలీవుడ్ లో ప్రజెంట్ హవా అంతా ఈ బ్యూటీదే. పెళ్లిసందడి సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ భామ ఆ సినిమాలో గ్లామర్ షోతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. పట్టుపావడాలోనే ఈ భామ తన అందచందాలతో సెన్సేషన్ సృష్టించింది.
ఆ సినిమా అంతగా హిట్ కాకపోయినా ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ధమాకా సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఒక్కసారిగా ఈ బ్యూటీకి డిమాండ్ కూడా పెరిగిపోయింది. అందుకే తన నెక్స్ట్ సినిమాలకు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఓవైపు సినిమాలతో బిజీబిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటోంది ఈ భామ. రోజుకో రకం ఔట్ ఫిట్ లో అందాలు ఒలకబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది.
తాజాగా శ్రీలీల తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ధమాకా బ్యూటీ ఓవైపు ట్రెండీగా కనిపిస్తూనే మరోవైపు ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది. ఈ ఫొటోలు చూసి శ్రీలీల అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీలీల పోస్టు చేసిన ఈ ఫొటోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఫొటోషూట్ లో శ్రీలీల కొంటెగా నవ్వుతూ.. వయ్యారాలు ఒలకబోస్తూ ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్ల గుండెల్లో అలజడి రేగుతోంది.
ఈ ఫొటోలకు శ్రీలీల ఫ్యాన్స్ తెగ లైకులు కొట్టేస్తున్నారు. ధమాకా బ్యూటీ గ్లామర్ ధమాకా అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రీ.. యూ ఆర్ సో క్యూట్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఎంతందంగా ఉన్నావే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రజెంట్ ఈ భామ చేతిలో మహేశ్ బాబు సినిమా, బోయపాటి-రామ్ కాంబోలో వస్తున్న సినిమాలు ఉన్నాయి. ఇవే కాకుండా బాలయ్య బాబుతో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం.