Sreeleela and Mahesh Babu : మహేశ్ బాబుతో నటించేందుకు శ్రీలీల కండిషన్లు.. అంత పొగరెందుకంటూ ఫ్యాన్స్ ఫైర్

- Advertisement -

Sreeleela and Mahesh Babu : కొందరు హీరోయిన్లు పదుల సంఖ్యలో సినిమాలు చేసినా సరైన ఫేమ్ రాదు. మరికొందరికి ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ వస్తుంది. అలా ఓవర్ నైట్ లో ఒక్క సినిమా.. అది కూడా ఫ్లాప్ మూవీతో స్టార్ అయింది శ్రీలీల. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది. ఇటీవలే ధమాకా సినిమాతో ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక వరుస ఆఫర్లతో ఈ బ్యూటీ తెగ బిజీ అయిపోయింది.

Sreeleela and Mahesh Babu
Sreeleela and Mahesh Babu

ఓవైపు హిట్ మూవీ.. మరోవైపు వరుస ఆఫర్లతో ఈ బ్యూటీ తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. ఆఫర్లు వచ్చేసరికి ఈ బ్యూటీ యాటిట్యూడ్ మారిందని అంటున్నారు నెటిజన్లు. ఇక మహేశ్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే ఏకంగా సూపర్ స్టార్ తో నటించడానికి కూడా కండిషన్లు పెట్టిందట.

Actress Sreeleela
Actress Sreeleela

స్టార్ హీరోయిన్ల ఛాన్సులన్నీ ఈ బ్యూటీయే కొట్టేస్తోంది. ప్రజెంట్ టాలీవుడ్ లో శ్రీలీలదే హవా. తన రేంజ్ పెరగడంతో  సడెన్ గా రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందంట బ్యూటీ. మొన్నటి వరకు  సినిమాకు కోటి రూపాయలు తీసుకున్న శ్రీలీల ఇప్పుడు ఏకంగా దానికి ట్రిపుల్ అడుగుతుందట. ఈ మధ్య సినిమాల్లో నటించడానికి కొన్ని కండిషన్లు కూడా పెడుతోందట. మహేశ్ బాబుతో చేయబోయే సినిమాకి ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేసిందట ఈ బ్యూటీ. శ్రీలీల పొగరు చూసి డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా షాక్ అయ్యాడట.

- Advertisement -

త్రివిక్రమ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో శ్రీలీలను సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారట. మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. నాన్ స్టాప్ గా 60డేస్ షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో  ఈ సినిమాలో శ్రీలీల పాత్ర గురించి చర్చ నడుస్తోంది. 

సినిమా కోసం అవి కావాలి ఇవి కావాలి.. ఆ సౌకర్యాలు ఉండాలి.. ఈ సౌకర్యాలు ఉండాలి అంటూ.. పిచ్చి పిచ్చి కండిషన్లు పెట్టినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే సినిమా నుంచి ఆమెను తీసేశారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  శ్రీలీల కూడా మహేశ్ బాబుతో సినిమా మిస్ అయినందకు పెద్దగా ఫీల్ అవ్వడంలే దట.

పెళ్లి సందడి  సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ శ్రీలీల.  హీరోయిన్ గా ఫస్ట్ మూవీ ప్లాప్ అయినా.. ఆమె ఇమేజ్ మాత్రం ఓ రేంజ్ లో పెరిగింది. రీసెంట్ గా మాస్ మహారాజ రవితేజతో నటించిన ధమాకా సినిమా సూపర్ హిట్ అయింది. పెళ్లి సందడి సినిమాతో క్లాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ధమాకాతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ మూవీలో శ్రీలీల పర్ఫామెన్స్ కు.. డైలాగ్స్ కు మంచి మార్కులే పడ్డాయి. దాంతో ఈ బ్యూటీ క్రేజ్ ఇంకా పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కోసం మేకర్స్ కూడా క్యూ కడుతున్నారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here