Actress Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ శాకుంతలం. ఈ మూవీ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి సమంత హాజరైంది. చాలా కాలం తర్వాత సామ్ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ ఈవెంట్‌లో సమంత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సమంతపై ట్వీట్స్, పోస్టులు, ట్రోల్స్ ఇలా రకరకాలుగా రచ్చ జరుగుతోంది. కానీ సమంతపై సామాజిక మాధ్యమాల్లో ఓ పేజీ పెట్టిన పోస్ట్ మాత్రం ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. అదేంటంటే..?

ట్విటర్‌కు చెందిన బజ్ బాస్కెట్ అనే ఓ పేజీ సమంత ఫొటోలతో ఓ క్యాఫ్షన్ ఇమేజ్ను షేర్ చేసింది. “సమంతను చుస్తుంటే బాధనిపిస్తోంది. ఆమె తన అందాన్ని కోల్పోయింది. విడాకుల నుంచి బయటపడ్డ ఆమె.. సినీ కెరీర్లో టాప్‌లో ఉన్న టైమ్‌లో.. మయోసైటిస్ వ్యాధి బారిన పడి మరింత బలహీనురాలయ్యింది” అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన సామ్ ఫ్యాన్స్ ఆ పేజీపై దుమ్మెత్తి పోస్తున్నారు. సామ్ ధైర్యంగా తన సమస్యతో పోరాడుతోంటే అందం పాడైందంటూ అడ్డమొచ్చినట్టు రాస్తారా అని ఫైర్ అవుతున్నారు.

https://twitter.com/Samanthaprabhu2/status/1612469940556267522?cxt=HHwWhIDQncS30uAsAAAA
అయితే ఈ పోస్టు సామ్ కంట కూడా పడింది. దీనికి ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చింది. “నేను తీసుకున్న విధంగా మీరు నెలల తరబడి చికిత్స తీసుకోకూడదని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. అదే దేవుడిని మీ అందం కోసం కూడా ప్రార్థిస్తున్నాను ” అని ట్రోలర్స్‌కు సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సామ్ పోస్ట్‌ను చూసిన ఫ్యాన్స్ సైతం సామ్‌కు సపోర్ట్ చేస్తూ మరిన్ని ట్వీట్స్ చేశారు.
అయితే యశోద మూవీ టైంలో ‘మయోసైటిస్’ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ఓ ఇన్‌స్టా పోస్ట్ ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే. ట్రీట్మెంట్ తీసుకుంటూనే మూవీకి డబ్బంగ్ చెప్పిన సామ్.. మళ్లీ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చింది. ఓపిక లేకపోయినప్పటికీ గుణశేఖర్‌పై ఉన్న గౌరవంతో ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్నట్లు చెప్పింది. ఈక్రమంలోనే సామ్ ఎమోషనల్ అయింది. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది. సామ్ ఏడ్వడం గమనించిన ఫ్యాన్స్.. సామ్.. సామ్.. నో సామ్.. నీకు మేమున్నాం అంటూ ధైర్యం చెప్పారు. వారిని చూసిన సమంత తన ఉద్వేగాన్ని దిగమింగుకుని ఓ చిరునవ్వునవ్వింది.

“ఈ క్షణం కోసం ఎన్నో రోజులుగా మేము ఎదురుచూస్తున్నాం. త్వరలో మా సినిమా రిలీజ్ కానుంది. గుణశేఖర్ మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఎలాగైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకుని.. ఓపిక లేకపోయినా బలం మొత్తాన్ని కూడబెట్టుకుని హాజరయ్యాను. కొంతమందికి సినిమా.. వాళ్ల జీవితంలో భాగం. కానీ, గుణశేఖర్‌కు సినిమానే జీవితం. ప్రతి సినిమా మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఆయన ప్రాణం పెట్టి తీశారు. ఆయనపై మీరు చూపించే ప్రేమాభిమానాన్ని చూడాలనుకున్నా. అందుకే వచ్చా.” అని సమంత చెప్పింది.
” కథ విన్నప్పుడు సినిమా అద్భుతంగా ఉండాలని సాధారణంగా నటీనటులు ఊహించుకుంటారు. కొన్నిసార్లు ఆ ఊహను దాటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ‘శాకుంతలం’ చూశాక నాకూ అదే భావన కలిగింది. మాకు సపోర్ట్‌గా నిలిచిన దిల్‌రాజుకు ధన్యవాదాలు. ఇందులో భాగం కావడం నా అదృష్టం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక్కటి మాత్రం మారలేదు. సినిమాని నేను ఎంతలా ప్రేమిస్తానో సినిమా కూడా నన్ను అంతలా ప్రేమిస్తోంది. ఈ సినిమాతో మీ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నా’’ అని సమంత మాట్లాడింది.