Shaakuntalam : ఏడ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలంటే కష్టంగా అనిపించింది.. సమంత పోస్టు వైరల్

- Advertisement -

Shaakuntalam : టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి చాలా విషయాలు సామ్ సోషల్ మీడియా వేదిక ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ జెస్సీ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు తన ఆరోగ్యానికి సంబంధించి.. సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించి మాత్రమే పోస్టులు పెడుతోంది.

Shaakuntalam
Shaakuntalam

సామ్‌కు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. కొంతకాలంగా ఈ భామ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం వల్ల ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. కానీ అప్పుడప్పుడు తాను పెట్టే పోస్టులను మాత్రం తప్పక లైక్ చేస్తున్నారు. ఆ రోజంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. సామ్‌ ఏ పోస్ట్‌ పెట్టినా అది క్షణాల్లో వైరల్‌ అవుతుంది. మయోసైటిస్‌ నుంచి కోలుకుంటున్న సమంత ఇటీవల సోషల్‌మీడియాలో మళ్లీ కాస్త యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటోంది.

Actress Samantha
Actress Samantha

తాజాగా ‘శాకుంతలం’ సినిమా సమయంలో తనకు కష్టంగా అనిపించిన ఓ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది సమంత.‘శాకుంతలం’లో నటించేటప్పుడు నా పాత్ర స్వభావానికి తగ్గట్టు ముఖంలో హావభావాలు ఒకేలా పెట్టడం, ఒకే భంగిమలో ఉండడం కష్టంగా అనిపించింది అని చెప్పిన సామ్‌. ‘‘నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు ఆఖరికి ఏడుస్తున్నప్పుడు కూడా ముఖంలో ఎక్స్‌ప్రెషన్‌ ఒకేలా పెట్టాల్సి వచ్చింది. అలాగే ఈ భంగిమనే కొనసాగించాల్సి వచ్చింది. అలా ఒకే స్టైల్‌ను కొనసాగించడం నా వల్ల కాలేదు. దాని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అలా కాకుండా ఈ సాషా(పెంపుడు కుక్క)ను తీసుకువెళ్లాల్సింది’’. అంటూ దీనంగా చూస్తున్న తన పెంపుడు కుక్క వీడియోను పోస్ట్‌ చేసింది.

- Advertisement -
2023 Movie
2023 Movie

ఇక దానితో పాటు శాకుంతలం భంగిమలో ఉన్న తన ఫొటోను కూడా షేర్‌ చేసింది. చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన సామ్‌ తాజాగా ముంబయి ఎయిర్‌పోర్టులో మెరిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా డబ్బింగ్‌ పనుల్లో మునిగిపోయింది ఈ హీరోయిన్‌. దీనితో పాటు సెన్సెషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది.

మరోవైపు ఇవాళ శాకుంతలం ట్రైలర్ రిలీజ్ అయింది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ సంబురపడుతున్నారు. ఇక ఈ మూవీలో సామ్ చాలా అందంగా కనిపిస్తోంది. డబ్బింగ్ కూడా చాలా చక్కగా చెప్పింది. ‘‘మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’’ అని సామ్ చెప్పిన డైలాగ్ ఈ మూవీకే హైలైట్. ‘శాకుంతలం’ ఈ మూవీ ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దీన్ని రూపొందించారు. శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇందులో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్‌ మోహన్‌ నటించారు. దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు నీలిమ గుణ. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. సాయిమాధవ్‌ బుర్రా మాటలు రాశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here