Megastar Records : టాలీవుడ్ రేంజ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన టాప్ 8 మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలు ఇవే

- Advertisement -

Megastar Records : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వర్గీయ నందమూరి తారకరామారావు తర్వాత అంతటి ప్రజాధారణ, అంతటి క్రేజ్ దక్కించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పొచ్చు.. ఎలాంటి అండదండా లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన చిరంజీవి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఆ తర్వాత హీరో గా మారి , హిట్టు మీద హిట్టు కొట్టి మెగాస్టార్ గా ఎదిగి తనకి తానే పోటీ అనే రేంజ్ లో ఎదిగాడు.. ఒకానొక్క దశలో చిరంజీవి ని మించిన హీరో ఇండియాలోనే లేదు అని జాతీయ మీడియా సైతం ఒప్పుకుంది.. అలాంటి మెగాస్టార్ తన సినిమాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమని కమర్షియల్ గా ఏ రేంజ్ కి తీసుకెళ్లాడో.. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఖైదీ:

Megastar Records
Megastar Records

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఖైదీ చిత్రం అప్పట్లో సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..అప్పటి వరకు కేవలం ఒక మామూలు హీరో గా ఉన్న చిరంజీవి ఈ సినిమాతో స్టార్ హీరో అయ్యాడు..అంతే కాదు..అప్పట్లోనే నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది ఖైదీ..ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

- Advertisement -

పసివాడి ప్రాణం :

Pasivadi Pranam

ఖైదీ చిత్రం తర్వాత చిరంజీవి ని మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘పసివాడి ప్రాణం’..ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటన అద్భుతం..కామెడీ తో పాటు సెంటిమెంట్ ని కూడా గుండెల్ని పిండేసేలా చేసింది ఈ చిత్రం..అప్పట్లో ఈ సినిమాకి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది..అంతే కాదు కమర్షియల్ సినిమా విలువలని కూడా బాగా పెంచింది ఈ చిత్రం.

యముడికి మొగుడు:

Yamudiki Mogudu Movie

మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ నేపథ్యం లో తీసిన ‘యముడికి మొగుడు’ అనే చిత్రం అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఈ చిత్రానికి ఆ రోజుల్లోనే దాదాపుగా ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు:

Athaki Yemudu Ammaiki Mogudu

మెగాస్టార్ చిరంజీవి నుండి వచ్చిన మరో ఇండస్ట్రీ హిట్ ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’..సరికొత్త జానర్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసి ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది..ఈ చిత్రం ఆరోజుల్లో దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందట..ఇక ఇదే సినిమాని తమిళం లో సూపర్ స్టార్ రజినీకాంత్ రీమేక్ చేసాడు..అక్కడ కూడా మంచి సక్సెస్ ని సాధించింది ఈ చిత్రం.

జగదేక వీరుడు అతిలోక సుందరి:

jagadeka veerudu athiloka sundari

తెలుగు సినిమా స్థాయిని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం ఇది..ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఆరోజుల్లో ఈ సినిమా బాహుబలి రేంజ్ అన్నమాట..మళ్ళీ ఈ రికార్డ్స్ ని ఎవ్వరు కొట్టలేరని అనుకునే వాళ్ళు..చిరంజీవి కి పాన్ ఇండియా లెవెల్ లో ఫేమ్ కూడా తెచ్చిపెట్టింది ఈ చిత్రం..ఈ సినిమా తర్వాత ఆయన బాలీవుడ్ లో కూడా వరుసగా నాలుగు చిత్రాల్లో హీరో గా నటించాడు..ఈ సినిమా విడుదలైనప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో వరదలు ఉండేవి..కానీ థియేటర్స్ వద్ద కలెక్షన్స్ వరద కూడా ఆగలేదు..అప్పట్లోనే సుమారుగా 9 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది ఈ చిత్రం.

గ్యాంగ్ లీడర్ :

GangLeader

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రికార్డ్స్ ని ఇప్పట్లో ఎవ్వరు అందుకోలేరు అని అనుకుంటున్న సమయం లో ఆ మరుసటి సంవత్సరం లోనే ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు మెగాస్టార్..ఈ సినిమా చిత్రం కూడా అదే రేంజ్ వసూళ్లను రాబట్టింది..జగదేక వీరుడు సినిమాకంటే ఒక 50 లక్షల రూపాయిల షేర్ ని ఎక్కువ రాబట్టింది ఈ చిత్రం..ఇదే చిత్రాన్ని హిందీ ‘ఆజ్ కా గుండా రాజ్’ అని రీమేక్ చేసారు..అక్కడ కూడా చిరంజీవినే హీరో..ఆ ఏడాది ఈ చిత్రం టాప్ 10 బాలీవుడ్ సినిమాలలో ఒకటిగా నిలిచింది..దాంతో చిరంజీవి పేరు ఇండియా వైడ్ మారుమోగిపోయింది.

ఘరానా మొగుడు:

Garana mogudu

టాలీవుడ్ కి మొట్టమొదటి 10 కోట్ల రూపాయిల షేర్ సినిమా ఇదే..ఈ చిత్రం తో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని నెంబర్ 1 హీరో గా తన స్థానం ని ఫిక్స్ చేసుకున్నాడు..రెండు , మూడు రూపాయిల టికెట్ రేట్స్ తో పది కోట్ల రూపాయిలు అంటే ఇప్పటి లెక్క ప్రకారం ఎంత వసూళ్లను రాబట్టి ఉండేదో ఊహించుకోండి..ఆరోజుల్లో రెండు కోట్లకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే..ఈ చిత్రం తర్వాతే మెగాస్టార్ కి గడ్డు కాలం ఎదురైంది.

ఇలా ఇండియన్ సినీ ఇండస్ట్రీ లో వరుసగా 6 ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే..ఈ పీరియడ్ లోనే మెగాస్టార్ చిరంజీవి ని జాతీయ పత్రికలు కూడా గుర్తించాయి..ఆరోజుల్లో అమితాబ్ బచ్చన్ ఇండియా లో ఉన్న హీరోలందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవాడు..అలాంటి అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో గా చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆస్కార్ అవార్డ్స్ సంస్థ చిరంజీవి కి ఆరోజుల్లోనే ఎంతో గౌరవం ఇచ్చింది..భారత దేశ చలన చిత్ర పరిశ్రమ నుండి ఆస్కార్ అవార్డ్స్ కి ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి ఇండియన్ హీరో గా చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించాడు..అయితే మెగాస్టార్ ఘరానా మొగుడు తర్వాత చాలా కాలం ఫ్లాప్స్ ని ఎదురుకున్నాడు..ఆ సమయం అందరూ పెద్ద పెద్ద హిట్స్ కొడుతున్నారు కానీ ఇండస్ట్రీ ని మరోలెవెల్ కి తీసుకెళ్లే హిట్స్ మాత్రం కొట్టలేకున్నారు..మధ్యలో నందమూరి బాలకృష్ణ నరసింహ నాయుడు సినిమాతో టాలీవుడ్ కి 20 కోట్ల రూపాయిల షేర్ మార్కెట్ ని ఓపెన్ చేసాడు.

ఇంద్ర :

Indhra Movie

వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న చిరంజీవికి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చిన సినిమా ఇది.. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది..టాలీవుడ్ కి ఇదే మొట్టమొదటి 30 కోట్ల రూపాయిల సినిమా.. ఈ చిత్రం వచ్చే సమయానికి చిరంజీవి తో సరిసమానమైన ఇమేజి ఉన్న స్టార్ హీరోలందరూ ఫేడ్ అయ్యే స్థితి లో ఉన్నారు.. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ తరం ప్రారంభం అయ్యింది..వాళ్ళ తరం తో కూడా చిరంజీవి సరిసమానం గా పోటీ పడ్డాడు..ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు.

నేటికీ టాలీవుడ్ లో అత్యధిక వంద కోట్ల రూపాయిల షేర్ మార్క్ ని సాధించిన సినిమాలు ఆయన ఖాతాలోనే ఉన్నాయి.. ఖైదీ నెంబర్ 150 , సైరా నరసింహా రెడ్డి మరియు రీసెంట్ గా విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రాలు వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్నాయి.. 68 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలతో సమానంగా డ్యాన్స్ వెయ్యడం, ఫైట్స్ చెయ్యడం , కామెడీ చెయ్యడం మాత్రమే కాదు.. వాళ్ళతో సరిసమానంగా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ కూడా పడుతున్నాడు.. ఇలాంటి స్టార్ హీరో ని ఎన్ని తరాలు మారిన చూడలేము ఏమో.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here