Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’ 14 రోజుల వసూళ్లు..నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ వైపు పరుగులు!

waltair veerayya


Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెగాస్టార్ కి తన వింటేజ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ని మళ్ళీ తిరిగొచ్చేలా చేసింది ఈ చిత్రం..ఒక అభిమాని సినిమా తీస్తే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే దానికి మరొక నిదర్శనం గా నిలిచింది ఈ చిత్రం.

డైరెక్టర్ బాబీ చిన్నప్పటి నుండి తాను ఎలాంటి చిరంజీవి ని చూస్తూ పెరిగాడో,అలాంటి చిరంజీవి ని మళ్ళీ వెండితెర మీద చూపించే ప్రయత్నం చేసాడు..అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని చూస్తున్న అనుభూతిని పొందారు కాబట్టే ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన ఈ సినిమా రెండు వారాలకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Waltair Veerayya
Waltair Veerayya

నైజాం ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు..ఆయన హీరో గా నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రం ఈ ప్రాంతం లో దాదాపుగా 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..కానీ ‘వాల్తేరు వీరయ్య‘ చిత్రం కేవలం రెండు వారాల్లోనే ఆ కలెక్షన్స్ ని దాటి 34 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది..ఇక చిరంజీవి కి కంచుకోటగా చెప్పుకునే సీడెడ్ ప్రాంతం లో 17 కోట్ల రూపాయిలు.

ఉత్తరాంధ్ర జిల్లాలో 18 కోట్ల రూపాయిలు , ఈస్ట్ గోదావరి జిల్లాలో 12 కోట్ల రూపాయిలు మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో 6 కోట్ల రూపాయిలు , కృష్ణ జిల్లాలో 7 కోట్ల 20 లక్షలు మరియు గుంటూరు జిల్లాలో 7 కోట్ల 50 లక్షల రూపాయిలను వసూలు చేసి సంచలనం సృష్టించింది.. అలా మొత్తం మీద రెండు వారాలకు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 103 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిందని అంచనా వేస్తున్నారు.