Aishwarya Rai : ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంట గురించి మాట్లాడుకోకుండా ఉండలేరు. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనిపించే ఈ జంట ని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు కొత్తగా పెళ్ళైన వారంతా. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈమధ్య కాలం లో వీళ్లిద్దరి మధ్య కొన్ని విబేధాలు ఏర్పడ్డాయని, ఆ కారణం చేత వీళ్లిద్దరు విడిపోయారని సోషల్ మీడియా లో ఒక కథనం వినిపిస్తుంది. దీని గురించి అటు అభిషేక్ కానీ, ఇటు ఐశ్వర్య రాయ్ కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు, దాంతో అది కేవలం ఒక రూమర్ గా మాత్రమే మిగిలింది. అయితే రీసెంట్ గానే వీళ్లిద్దరు అనంత్ అంబానీ పెళ్లి కి హాజరు అయ్యారు.
ఈ వివాహ వేడుకలో ఐశ్వర్య రాయ్ తన కూతురితోనే ఎక్కువగా కనిపించింది. అభిషేక్ బచ్చన్ తో కలిసి ఉన్నట్టు ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా బయటకి రాలేదు. ఆయన పాటికి ఆయన ఉండగా, ఐశ్వర్య రాయ్ పాటికి ఐశ్వర్య రాయ్ ఉంది. ఇలా ఎడమొహం పెడమొహం లాగ సెపెరేట్ గా ఉండడం ని చూసి కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో గ్యాప్ వచ్చింది, నిజంగానే విడాకులు తీసుకున్నారేమో అని సోషల్ మీడియా లో ఇప్పుడు పెద్ద చర్చ సాగుతుంది. అదే సమయం లో ఐశ్వర్య రాయ్ తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో కలిసి ఫోటో దిగడం అందరినీ కంగుతినేలా చేసింది.
ఇన్నేళ్లు సల్మాన్ ఖాన్ ని భద్ర శత్రువులాగా భావించిన ఐశ్వర్య రాయ్, ఇప్పుడు అతని చేతిలో చెయ్యి వేసుకొని ఫోటో దిగడం, అభిషేక్ బచ్చన్ కి దగ్గర అవ్వడం వంటివి కలలో కూడా ఊహించని దృశ్యాలు. అయితే అభిషేక్ బచ్చన్ రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో గ్రే విడాకులు గురించి తన ఫాలోవర్లకు వివరిస్తూ ఒక ట్వీట్ వేసాడు. ఎన్నో ఏళ్ళు కలిసి ఉన్న దంపతులు విడిపోయిన తర్వాత బ్రతకడం నరకప్రాయం వంటిది అంటూ గ్రే విడాకులకు సంబంధించి ప్రొమోషన్స్ చేసాడు. ఇదంతా చూస్తుంటే కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో జరిగింది అనే సంకేతాలు జనాల్లోకి బలంగా వెళ్తున్నాయి.