Indian 3 Movie : ఓటీటీ లోకి నేరుగా విడుదల కానున్న ‘ఇండియన్ 3 ‘ చిత్రం..సెప్టెంబర్ లో విడుదల?

- Advertisement -

Indian 3 Movie :  ఈమధ్య కాలం లో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం సర్వసాధారణం అయిపోయింది. పాన్ ఇండియా లెవెల్ లో సీక్వెల్స్ మంచి ఆదరణ దక్కించుకుంటున్న ఈ నేపథ్యం లో దర్శక నిర్మాతలు కూడా తమ బ్రాండ్ ఇమేజి ని పెంచుకోవడం కోసం సీక్వెల్స్ చేస్తూ ఉంటారు. అలా సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ తాను తీసిన ఆల్ టైం క్లాసిక్ ఇండియన్ కి సీక్వెల్ గా ఇండియన్ 2 చేసి రీసెంట్ గానే విడుదల చేసాడు. ఈ సినిమాకి ఆడియన్స్ నుండి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి భాగం తో పోలిస్తే రెండవ భాగం ఎందులోనూ పనికిరాదు అని తేల్చి చెప్పేసారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయం లోనే శంకర్ ‘ఇండియన్ 3 ‘ సంబంధించిన షూటింగ్ కూడా 70 శాతం కి పైగా పూర్తి అయ్యిందట.

Indian 3 Movie
Indian 3 Movie

ఇండియన్ 2 క్లైమాక్స్ తర్వాత మనం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కూడా చూడొచ్చు. ఈ ట్రైలర్ విన్టేజ్ శంకర్ మార్క్ అంటే ఏమిటో చూపించింది. ఈ ట్రైలర్ రేంజ్ లో ఇండియన్ 2 సగం ఉన్నా కూడా ఈరోజు పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది కదా అనే ఫీలింగ్ ప్రతీ ఒక్కరిలోనూ కలుగుతుంది. అయితే ఇండియన్ 2 బాక్స్ ఆఫీస్ బిజినెస్ చేసిన నష్టానికి ఎవరూ కూడా ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చెయ్యడానికి సాహసం చెయ్యరు. బిజినెస్ జరగడం చాలా కష్టం, కాబట్టి ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ లో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

Vibrant Murals Adorn Chennai Walls for Kamal Haasan's Indian 2 Shoot - See Pics

- Advertisement -

 

నెట్ ఫ్లిక్స్ డైరెక్ట్ ఓటీటీ డీల్ కి భారీ మొత్తం లో డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ లో విడుదల చేయబోతున్నారట. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రం ఓటీటీ లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క ఇండియన్ 2 చిత్రాన్ని ఆగష్టు 15 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదల చెయ్యబోతున్నారు. థియేటర్స్ లో మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ చిత్రం, ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.

Kamal Haasan announces new release date for Indian 2 and first song with new posters | Tamil News - The Indian Express

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here