Tollywood Re-Release : త్వరలో రీ రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే..

- Advertisement -

Tollywood Re-Release : టాలీవుడ్​లో ప్రజెంట్ అంతా రీ రిలీజ్ సినిమాలదే​ ట్రెండ్​. ఖుషి, ఒక్కడు, 3 వంటి సూపర్ హిట్ సినిమాలు ఇప్పటికే  థియేటర్లలో రెండోసారి సందడి చేశాయి. అదే బాటలో మరికొన్ని సినిమాలను రిలీజ్ చేసేందుకు బ్లాక్ బస్టర్ నిర్మాతలు రెడీ అవుతున్నారు. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..?

Tollywood Re-Release
Tollywood Re-Release

మాస్ మహారాజ రవితేజ​ ప్రస్తుతం బ్యాక్​ టూ బ్యాక్​ హిట్స్​తో ఫుల్ జోష్​లో ఉన్నాడు. ధమాకాతోపాటు వాల్తేరు వీరయ్య కూడా బ్లాక్​ బస్టర్​ హిట్​ కొట్టింది. రవితేజ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్న నిర్మాతలు ఆ హీరో బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమా మిరపకాయను రీ రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. హరీష్ శంకర్​ డైరెక్షన్లో 2011లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్​ హిట్ కొట్టింది. ఇప్పుడు జనవరి 26న మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది.

Tollywood Re Releases movies

కశ్మీర్ ఫైల్స్ మూవీ మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. ఏడాది తిరగకుండానే ఈ చిత్రాన్ని రీ రిలీజ్​ చేయబోతుండడం విశేషం. కశ్మీర్ ఫైల్స్ గతేడాది మార్చి 11న విడుదలైంది. హిట్ టాక్​తో భారీ కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు మరోసారి రిలీజ్​కు రెడీ అయ్యింది. జనవరి 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.

- Advertisement -

ఆల్​ టైమ్​ గ్రేట్​ మూవీ టైటానిక్​ కూడా మరోసారి ప్రేమికుల హృదయాలను తాకబోతోంది. 1996లో వచ్చిన ఈ క్లాసిక్​ మూవీని మళ్లీ ఫిబ్రవరి 10న రీ రిలీజ్​ చేయబోతున్నారు.

పవర్ స్టార్​ పవన్ కల్యాణ్ కెరియర్లో ఫస్ట్​ బ్లాక్​ బస్టర్​ మూవీ తొలిప్రేమ. ప్రేమ కథా చిత్రాల్లో ట్రెండ్​ సెట్​ చేసిన ఈ మూవీ సైత్ మళ్లీ విడుదల కాబోతోంది. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

అల్లు అర్జున్​ సూపర్​ హిట్ మూవీ దేశముదురు మళ్లీ రిలీజ్​ కాబోతోంది. ఈ పూరీ జగన్నాథ్ మార్క్​ మూవీ ఏప్రిల్​ 7న థియేటర్లో విడుదల కానుంది.

ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్​ బస్టర్​ మూవీ సింహాద్రి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్​కు మాస్​ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఈ మూవీ మే 20న రీ రిలీజ్​ చేయబోతున్నారు.

దేశభక్తి చిత్రాలకు బ్రాండ్​ గా నిలిన వాటిల్లో ఖడ్గం మూవీ ఒకటి. ఈ సినిమాను కూడా మళ్లీ రిలీజ్ చేయబోతున్నారు. క్రియేటివ్​ డైరెక్టర్​ కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here