Ashu Reddy : అషూ రెడ్డి..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..యూట్యూబ్ వీడియో లతో బాగా ఫెమస్ అయ్యింది.జూనియర్ సమంతగా పాపులర్ అయ్యింది. ఈమెను చూసిన చాలామంది అచ్చం సమంత లానే ఉంది అని కామెంట్స్ చేస్తారు. అయితే ఈమెకు అదే ప్లస్ గా మారింది. దాంతో సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ క్రేజ్ తో బిగ్ బాస్ షో లో కూడా ఛాన్స్ వచ్చింది. ఇక బిగ్ బాస్ షో కి వెళ్ళాక ఈమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.కానీ ఈ అమ్మడు మాత్రం నచ్చిన వాటిని మాత్రమే చేస్తూ వస్తుంది..దాంతో యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంది..
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక ఈమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. కొన్ని ఈవెంట్లకు యాంకర్ గా అలాగే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా అషూ రెడ్డి కి అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కూర కారుకు పిచ్చెక్కిస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అయితే , మొన్నామధ్య రాంగొపాల్ వర్మ తో చేసిన ఇంటర్వ్యూ రచ్చ రచ్చ చేసింది. రాంగోపాల్ వర్మ అషూ రెడ్డి కాలి వేళ్ళను నోట్లో పెట్టుకోవడం సంచలనం సృష్టించింది.కానీ ఈ ఇంటర్వ్యూ విషయంలో చాలామంది అషూ రెడ్డిని విమర్శించారు..
అయితే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న అషూ రెడ్డి తల్లి ఆమెకు ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత మంచిది అని భావిస్తుందట.ఇక ఈ నేపద్యంలోనే ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టిందని టాక్..ఒక యూట్యూబర్ ని అషూ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లి భావిస్తుందట. అయితే ఆ యూట్యూబర్ అషు రెడ్డి తల్లికి కూడా చాలా నచ్చాడట. ఆయన వ్యక్తిత్వం చాలా మంచిదని అషూకు ఈ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తేనే ఆమె జీవితం బాగుపడుతుందని ఇలాంటివన్నీ మానేసి బుద్ధిగా మారిపోతుందని అషూ రెడ్డి తల్లి భావిస్తుందట..మరి ఈ వార్తలో నిజమేంతో తెలియదు కానీ తెగ వైరల్ అవుతుంది..మరి పెళ్ళి ఎప్పుడూ చేసుకుంటుందో చూడాలి..