2022 Music Albums : 2022 ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా స్పెషల్. కరోనా వల్ల దాదాపు రెండేళ్లు సైలెంట్ అయిపోయిన ఇండస్ట్రీకి 2022 కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్. కేజీఎఫ్2 వంటి సినిమాలు సౌత్ సినిమా ఇండస్ట్రీ స్థాయిని ఆకాశానికెత్తేశాయి. అయితే ఈ సంవత్సరంలో టాలీవుడ్లో వచ్చిన ది బెస్ట్ సినిమాలు ఏంటంటే.. ఆర్ఆర్ఆర్, సీతారామం అని ఠక్కున చెప్పేస్తారు. మరి 2022లో ది బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఏంటని అడిగినా ఈ రెండు సినిమాల పేర్లే చెప్పేస్తారు. ఇవే కాకుండా ఈ ఏడాది రిలీజ్ అయిన మూవీస్‌లో టాప్ 10 బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఏం ఉన్నాయో ఓ లుక్కేద్దామా..?
10. విరాట పర్వం
9. కార్తికేయ 2
కార్తికేయ-2 సినిమా ఎన్నో అడ్డంకుల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా చిన్నస్థాయిలో రిలీజ్ అయ్యి పాన్ ఇండియా ఇమేజ్ దక్కించుకుంది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌లకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాటలేం లేకపోయినా.. కృష్ణ ట్రాన్స్ – కృష్ణ ఫ్లూట్ థీమ్ మాత్రం అదిరిపోయాయి. కాలభైరవ కంపోజ్ చేసిన ఫ్లూట్ థీమ్ అయితే చాలా మంది రింగ్‌టోన్‌గా పెట్టుకున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ థీమ్‌తో వచ్చిన రీల్స్ అన్నీ ఇన్నీ కాదు.
8. మేజర్
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన సినిమాల్లో మేజర్ మూవీ ఒకటి. ఈ సినిమాలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌గా నటించిన అడివి శేష్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. వార్.. ఎటాక్.. యాక్షన్.. రొమాన్స్… ఫ్యామిలీ… ఇలా అన్ని ఎమోషన్స్‌ను చూపిస్తూ.. అడివి శేష్ అదరగొట్టాడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా ఈ మూవీ రూపొందింది. ఇక ఈ సినిమాలోని హృదయమా సాంగ్‌ను పాడుకోని ప్రేమికులుండరు. ఇదే కాకుండా జనగణమన, ఓ ఈషా సాంగ్స్ కూడా అదిరిపోయాయి.
7. సర్కారు వారి పాట
సూపర్ స్టార్ మహేశ్ బాబుకుమరో కమర్షియల్ హిట్ తీసుకొచ్చిన సినిమా సర్కారు వారి పాట. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌గా కలెక్షన్లు సంపాదించాయి. మహేశ్ బాబు, థమన్ కాంబోలో మరో సూపర్ హిట్ ఆల్బమ్ చేరింది. ఈ మూవీలో కళావతి, మమ మమ మహేశ సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి.
6. రాధే శ్యామ్
పాన్ ఇండియా ఇమేజ్ దక్కించున్న ప్రభాస్.. బుట్టబొమ్మ పూజ హెగ్డేలు కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాలో నిన్నే లే నిన్నే లే పాట సూపర్ హిట్ అయింది. ఇదే కాకుండా ఈ రాతలే, నగుమోము తారలే పాటలు కూడా మంచి టాక్ సంపాదించుకున్నాయి.5. ఖిలాడీఖిలాడీ సినిమా రిజల్ట్ పక్కన పెడితే డీఎస్పీ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేసిన ఆల్బమ్ ఇది. ఈ ఆల్బమ్‌లోని ఫుల్ కిక్కు, అట్టా సూడకే పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
4. DJ టిల్లు
ఈ ఇయర్లో సూపర్ హిట్ ఎంటర్టైనర్ అంటే డీజే టిల్లు సినిమాయే. ఈ మూవీలో టిల్లు అన్నా డీజే సాంగ్ చాలా పాపులర్ అయింది. ఈ ఏడాది ఏ ప్రోగ్రామ్ జరిగినా.. ఏ ఫంక్షన్ జరిగినా డీజే టిల్లు పాట ఉండాల్సిందే అన్న రేంజ్లో హిట్ అయింది.
3. భీమ్లా నాయక్
ఈ ఏడాది తమన్ తన బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. సర్కారు వారి పాట, అఖండ, భీమ్లా నాయక్‌లతో తమన్ తన రేంజ్ ఏంటో టాలీవుడ్‌కి చూపించాడు. లాలా.. భీమ్లా పాటలతో పాటు అంత ఇష్టం ఏంటట పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
2. RRR
ఈ ఏడాది ఇండియన్ సినిమాను శాసించిన మూవీ ఆర్ఆర్ఆర్. సినిమాయే కాదు ఈ మూవీలో పాటలు కూడా ఆ రేంజ్లో హిట్ అయ్యాయి. ఇక నాటు నాటు సాంగ్కైతే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ కలిసి చిందేశాయి. కేవలం ఇండియాలోనే కాదు జపాన్, రష్యా వంటి విదేశాల్లో కూడా ఈ పాట ఓ ఊపు ఊపేసింది. ఇక కొమ్మా ఉయ్యాలా.. కోన జంపాలా, కొమురం భీముడో పాటలు సినిమాకు ప్రాణం పోశాయి.