Anupama Parameswaran : కృష్ణుడి గెటప్​లో ఉన్న ఈ క్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్..?

- Advertisement -

Anupama Parameswaran : చాలా మంది తల్లులు తమ పిల్లలకు చిన్నప్పుడు చిన్ని కృష్ణుడి వేషం వేసి మురిసిపోతుంటారు. ఆ కృష్ణుడే తమ పిల్లల రూపంలో ఇంట్లో నడయాడుతున్నాడని భావిస్తుంటారు. అలా కృష్ణాష్టమి వచ్చిన ప్రతిసారి ఇంట్లో పిల్లలకు చిలిపి కన్నయ్య వేషం వేసి తమ సరదా తీర్చుకుంటారు. అలాగే ఓ టాలీవుడ్ హీరోయిన్​కు కూడా తాను చిన్నప్పుడు కిట్టయ్య వేషం వేశారు. గోకుల కృష్ణుడి వేషంలో ముద్దుగా కనిపిస్తోంది ఈ బ్యూటీ. Anupama Parameswaran ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. మరి ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

Anupama Parameswaran
Anupama Parameswaran

అయ్యో.. ఈ చిలిపి కిట్టయ్య ఎవరో ఇంకా మీరు గుర్తుపట్టలేదా. ఇదిగో మీ కోసమే చెప్పేస్తున్నా.. ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా బిజీ అయిన అనుపమ పరమేశ్వరన్. చూశారు కదా.. చిన్నప్పటిలాగే ఇప్పుడు కూడా ఎంత ముద్దుగా ఉందో. ఈ బ్యూటీ మలయాళ రీమేక్ ప్రేమమ్​తో తెలుగు తెరపై తొలి అడుగు వేసింది.

Anupama Parameswaran images

ఆ తర్వాత మాటల మాంత్రికుడు దర్శకత్వం వహించిన అఆతో సందడి చేసింది. ఈ సినిమాలో కాస్త నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది అనుపమ. ఆ తర్వాత ఇక వరుస అవకాశాలతో టాలీవుడ్​లో పాగా వేసింది ఈ కేరళ కుట్టి. తన అందం, క్యూట్ ఎక్స్​ప్రెషన్స్, నటనతో అందరినీ తెగ ఆకట్టుకుంది. ఇక నూడుల్స్ లాంటి తన భిన్నమైన జుట్టుతో కుర్రాళ్లను కట్టిపడేసింది. అందుకే మన తెలుగు కుర్రాళ్లు ఈ బ్యూటీ నూడుల్స్ బ్యూటీ అని పేరు పెట్టేశారు.

- Advertisement -
Anupama Parameswaran Stills

అఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. శతమానంభవతితో ఈ భామ కుర్రాళ్లతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, రౌడీ బాయ్స్, కార్తికేయ-2 మూవీస్​తో వరుస హిట్లు కొట్టింది. తెలుగులోనే కాదు తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్లు దక్కించుకుంది.

Anupama Parameswaran Photos

ప్రస్తుతం కార్తికేయ -2 సక్సెస్​తో ఫుల్ జోష్​లో ఉంది అనుపమ. ఈ మూవీలో నటించిన నిఖిల్​తోనే ప్రజెంట్ ఈ అమ్మడు 18పేజెస్ అనే సినిమా చేసింది. ఈ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. అంతే కాకుండా డీజే టిల్లు ఫేం సిద్ధూ జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్​లో నటిస్తోందని టాక్. కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ మూవీసే కాకుండా బటర్​ఫ్లై అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో కూడా నటిస్తోంది అను. ఈ చిత్రాన్ని డైరెక్టుగా ఓటీటీలోకి విడుదలచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ + హాట్‌స్టార్‌లో డిసెంబర్‌ 29 నుంచి ఈ సినిమా డిజిటల్‌ ప్రేక్షకులను అలరించనుంది. మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ని బట్టి చూస్తే పిల్లల కిడ్నాప్‌ చూట్టూ ఈ కథ తిరుగుతున్నట్లు అర్థమవుతోంది.

కిడ్నాప్‌ అయిన పిల్లలను అనుపమ కాపాడుకుంటుందా.. కిడ్నాపర్‌ పిల్లలను చంపేశాడా.. ఇలా సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రానున్న ఈ సినిమాలో భూమికా చావ్లా, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఇవే కాకుండా మలయాళంలో జేఎస్కే, తమిళంలో సైరెన్ అనే సినిమాలకు కూడా కాల్షీట్లు ఇచ్చేసింది. క్షణం తీరికలేకుండా గడుపుతోంది ఈ నూడుల్స్ బ్యూటీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here