Walthair veeraya : ‘వాల్తేరు వీరయ్య’ లో చిరంజీవి వేసుకున్న ఆ షర్ట్ ఎవరిదో తెలుసా..?

- Advertisement -

Walthair veeraya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’.. ఈ సినిమా ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని యావత్ సినీ ప్రెమికులు ఆసక్తి కనబరుస్తున్నారు.. మెగాస్టార్ కు గట్టి పోటీని ఇస్తూ మాస్ మహరాజా రవితేజ నటించారు.డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.. ఇందులోని పాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా వచ్చిన పూనకాలు లోడింగ్’ పాట ని సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది.

Walthair veeraya
Walthair veeraya

మాస్ నంబర్ లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అనడం హైప్ ను క్రియేట్ చేసింది.

ఇది ఇలా వుండగా..ఈ పాటలో చిరు వేసి షర్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో చిరు ఎరుపు రంగు పూల చొక్కా ధరించి మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఆ షర్ట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా ఓ సంబంధం ఉంది. చెర్రీ కూడా అచ్చం అలాంటి షర్ట్ నే ధరించి ఓ యాడ్ లో కనిపించాడు. దాంతో చిరు వేసిన షర్ట్  చరణ్ ది అంటూ తెగ ప్రచారం జరుగుతుంది..

- Advertisement -
Chiranjeevi
Chiranjeevi

ఇకపోతే పూనకాలు లోడింగ్ సాంగ్ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా ఉందుంటున్నారు అభిమానులు.. జాతర సెటప్, భారీ జనసమూహం ఈ మాస్ నంబర్‌ అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. చిరంజీవి, రవితేజల బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా ఉపయోగించాడు. ఆయన మాస్ లుక్ ఆడియన్స్ను ఎలా ఆకర్షిస్తుందో చూడాలి..సంక్రాంతి కానుకగా విడుదల కానుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here