Waltair Veeraya : ‘వాల్తేరు వీరయ్య’హై వోల్టేజ్ సాంగ్ ..ఫ్యాన్స్ కు ‘పునాకాలు ‘..

- Advertisement -

Waltair Veeraya : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య ..బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ మూవీలో రవితేజ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Waltair Veeraya
Waltair Veeraya

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన అన్నీ కూడా మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులను కూడా తెగ ఆకట్టుకున్నాయి..దాంతో సినిమా పై అంచానాలు రెట్టింపు అయ్యాయి.ఇప్పటికి ఈ మూవీ నుంచి ‘బాస్ పార్టీ’, ‘చిరంజీవి-శ్రీదేవి’, ‘వీరయ్య‘ సాంగ్స్ రిలీజ్ కాగా.. చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇప్పుడు సినిమాలోని హై వోల్టేజ్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. పూనకాలు లోడింగ్ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి, రవితేజ కలిసి డాన్స్ చేయబోతున్నారు. ఇద్దరు మాస్ హీరోలు కలిసి ఒక మాస్ సాంగ్ కి డాన్స్ వేస్తే, ఎలా ఉంటాదో చూడడానికి అందరూ ఎదురు చూస్తున్నారు.

Dhamaka
Dhamaka

న్యూ ఇయర్ కానుకగా శుక్రవారం డిసెంబర్ 30న ఈ సాంగ్ ని విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో చిరు, రవితేజ ల డాన్స్ ఫోజ్ చూస్తుంటే అభిమానులకు పూనకాలు రావడం గ్యారంటీ అనిపిస్తుంది. ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తుంది. మాస్ బీట్ తో వచ్చే ఈ పాట ప్రేక్షకులకు నచ్చుతుందని మేకర్స్‌ అంటున్నారు.. గతంలో రవితేజ, చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఒక పాటలో అలా మెరిసిన సంగతి తెలిసిందే…ఈ సినిమా మ్యూజిక్ పై మెగా ఫ్యాన్స్ నిరాశపరిచారు డీఎస్పీ..మరి ఒవరాల్ గా సినిమా ఎలా ఉంటుందో చూడాలి..సంక్రాంతి బరిలో ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి వాటికి ఎలాంటి పోటీని ఇస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here