Dhamaka Collections : రవితేజ ఖాతాలో హిట్ పడినట్లేనా? ఫస్ట్ డే ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

- Advertisement -

Dhamaka Collections : తెలుగు సీనియర్ హీరో మాస్ రాజా రవితేజ తాజాగా నటించిన ధమాకా. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయరాం, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నిన్న అట్టహంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ సినిమాలో రవితేజ సరసన పెళ్ళి సందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది..

Dhamaka Collections
Dhamaka Collections

క్రాక్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అనంతరం రవితేజ నుంచి వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. కథ రొటీన్ గా ఉన్నప్పటికీ.. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌, ఫైట్స్‌, శ్రీలీల గ్లామర్ షో, కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అలాగే రవితేజ ఇందులో డ్యూయల్ రోల్ పోషించి అదరగొట్టేశాడు.

ఇక టాక్ అనుకూలంగా ఉండటంతో.. ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారం లేపింది. పోటీగా నిఖిల్ హీరోగా తెరకెక్కిన 18 పేజెస్‌ మూవీ దిగినా సరే.. ధమాకా ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి మాస్ బీభత్సం సృష్టించింది.నిన్న ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోగా.. ఈ చిత్రం అంచనాలను మించి రూ. 4.66 కోట్ల షేర్‌, రూ. 7.85 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసి అదరగొట్టింది..కలెక్షన్స్ తో దుమ్మురేపింది ధమకా.. రవి తేజ కెరీర్ లో మరో హిట్ ను అందుకున్నాడు..

- Advertisement -
18 pages

అదే విధంగా.. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ. 5.26 కోట్ల షేర్‌, రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి. కాగా, ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 18 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ధమాకా. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలంటే ఇంకా రూ. 13.74 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది..ఇప్పటి వరకూ సినిమా మంచి కలెక్షన్స్ ను అందుకుంది కథ కూడా బాగానే ఉందనే టాక్ వినిపిస్తోంది.. మరి ముందు ఎలా ఉంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here