Vijay Deverakonda – Rashmika : దుబాయ్ లో కెమెరాలకు చిక్కిన విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటో వైరల్..



Vijay Deverakonda – Rashmika Mandanna గురించి అందరికి తెలిసిందే.. గీతాగోవిందం సినిమాతో బాగా ఫెమస్ అయ్యారు.. ఆ సినిమానే వారిద్దరిని ప్రేమలో పడేలా చేసిందని విమర్శకులు అంటున్నారు.అప్పటి నుంచి వీరిద్దరూ సమయం దొరికినప్పుడల్లా ట్రిప్ లు వేస్తూ అడ్డంగా దొరుకుతున్నారు.. మొన్నీమధ్య మాల్దీవులలో విహరించిన వీళ్ళు ఇప్పుడు దుబాయ్ లో ఎంజాయ్ చేస్తూ కెమెరాలకు చిక్కారు.. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇక గాసిప్ రాయుళ్లు పెన్నుకు పదును పెట్టి వార్తలు క్రియేట్ చేస్తున్నారు.

Vijay Deverakonda - Rashmika
Vijay Deverakonda – Rashmika

తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ దుబాయ్ టూర్ కి వెళ్లారు. విజయ్ దేవరకొండతో సెల్ఫీ దిగడానికి ఒక అభిమాని ట్రై చేస్తుంటే మధ్యలో రష్మిక కూడా ఆ ఫొటోలో కనిపించేలా పోజ్ ఇస్తున్న ఒక ఫోటో బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే వీరిద్దరూ దుబాయ్ కి ఏ పని మీద వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది. ఇక వీరిద్దరి సినిమాలు విషయానికి వస్తే.. రష్మిక మందన్న ఇటీవలే పుష్ప-2 షూటింగ్ లో పాల్గొంది. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్.. ప్రస్తుతం పాట చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తుంది..

Vijay Deverakonda - Rashmika Mandanna photos
Vijay Deverakonda – Rashmika Mandanna photos

ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్.. ఆ సినిమా బాక్సఫీస్ వద్ద బోల్తా కొట్టింది.. ఖుషి సినిమాతో బిజీగా ఉన్నారు. ఖుషి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఎదురు చూస్తూనే, మరో పక్క తన 12వ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేస్తున్నాడు.

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఖుషి టాకీ పార్ట్ పూర్తి చేసి పూర్తి స్థాయిలో గౌతమ్ తిన్ననూరి సినిమాలో పాల్గొనున్నాడు. కాగా సమంత ఆరోగ్య కోలుకోవడంతో త్వరలోనే ఖుషి షూటింగ్ స్టార్ట్ అవుతుందని చిత్ర డైరెక్టర్ తెలిపారు.. ఈ సినిమా అన్న విజయ్ దేవరకొండకు హిట్ ను ఇస్తుందేమో చూడాలి..