Vijay Deverakonda – Rashmika ల మధ్య నిజంగా ఆ మ్యాటర్ నడుస్తుందా?

vijay deverakonda Rashmika


Vijay Deverakonda – Rashmika : ఇటీవల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన సినిమాలలో ఒకటి గీతాగోవిందం..ఈ సినిమాతో లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్నారు..రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వీరిద్దరిపై భారీ ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి.. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇద్దరు కలిసి వెళ్లకున్న ఇద్దరూ ఒకే చోటుకి వెళ్లారని క్లియర్ గా అర్థమయింది. వీళ్ళిద్దరిపై వస్తున్న వార్తలకు రష్మిక స్పందించింది. అవును మేమిద్దరం కలిసి ట్రిప్ కు వెళ్ళామని క్లారిటీ ఇచ్చింది. అయితే అతడితో ట్రిప్పుకు వెళితే తప్పేంటి అని రష్మిక ప్రశ్నించింది..

Vijay Deverakonda - Rashmika
Vijay Deverakonda – Rashmika

రష్మిక ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈమెపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ -రష్మిక ల మధ్య నిజంగా ఆ మ్యాటర్ నడుస్తుందా.. విజయ్ దేవరకొండ కు తనకు ఉన్న రిలేషన్ గురించి వస్తున్న వార్తలను రష్మిక కొట్టిపారేసింది. మేమిద్దరం మంచి స్నేహితులం స్నేహితులుగానే ఇద్దరం ట్రిప్ కు వెళ్ళాం అని రష్మిక తెలిపింది. కానీ జనాలు మాత్రం వీరిద్దరి మధ్య వేరే రిలేషన్ ఉందని గట్టిగా నమ్ముతున్నారు.. చాలా మొదట స్నేహితులం అని తర్వాత రిలేషన్ ను బయటపెడుతున్నారు.. ఇక వీరిద్దరూ కూడా అలానే చెబుతారేమో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Vijay Deverakonda and Rashmika Mandanna

అలా అనుకోవడంలో తప్పులేదు.. చాలాసార్లు రష్మిక విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి కనిపించింది. వీళ్ళిద్దరూ కలిసి ట్రిపుకు వెళ్లడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని చాలామంది అనుకుంటున్నారు. అవి కేవలం రూమర్స్ మాత్రమే నిజాలు కావని రష్మిక చెప్పుకొచ్చింది. ఇకపోతే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం సమంత తో కలిసి ఖుషి సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా అన్నా కలిసి వస్తుందేమో చూడాలి..