కమెడియన్ Venu Madhav తల్లి పరిస్థితి ఎలా అయ్యిందో చూస్తే ఏడుపు ఆపుకోలేరుటాలీవుడ్ లో ఎంతోమంది కమెడియన్స్ ఉండొచ్చు.. కానీ కొంతమంది మాత్రమే ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల మదిలో తమకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకుంటారు.. అలాంటి కమెడియన్స్ బౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా ఎప్పటికీ చిరంజీవులు.. అలాంటి లెజెండరీ కమెడియన్స్ లో ఒకడు వేణు మాధవ్ Venu Madhav రెండు దశాబ్దాల పాటుగా అగ్ర కమెడియన్స్ లో ఒకరిగా కొనసాగిన వేణు మాధవ్ , సుమారు 500 సినిమాలకు పైగా నటించాడు.

Comedian Venu Madhav
Comedian Venu Madhav

సెపెరేట్ మ్యానరిజమ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఆయన స్పెషాలిటీ..ఒకానొక దశలో బ్రహ్మానందం , MS నారాయణ వంటి లెజెండ్స్ ని కూడా డామినెటే చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైన కమెడియన్ ఈరోజు మన మధ్య లేకపోవడం తెలుగు సినీ పరిశ్రమ చేసుకున్న దురదృష్టం. 2019 వ సంవత్సరం , సెప్టెంబర్ 25 వ తారీఖున వేణుమాధవ్ మరణించడం యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది.

వేణుమాధవ్ మంచి డిమాండ్ ఉన్న కమెడియన్ గా బాగానే డబ్బులను సంపాదించాడు. ఆయన ఆస్తులు దాదాపుగా 20 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.. కానీ ఆయన తల్లి మాత్రం అద్దె ఇంటిలోనే ఉంటుంది.. ఇటీవలే ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వేణుమాధవ్ ని తలచుకొని బాధపడుతూ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Comedian Venu Madhav Mother

ఆమె మాట్లాడుతూ ‘నాకు ముగ్గురు కొడుకులు..వారిలో వేణుమాధవ్ అందరికంటే చిన్నోడు..చిన్నప్పటి నుండి వాడికి మిమిక్రీ చెయ్యడం అంటే బాగా ఇష్టం..ఒక ఫంక్షన్ లో వాడు మిమిక్రీ అద్భుతంగా చెయ్యడం చూసిన డైరెక్టర్ ఎస్ వీ కృష్ణా రెడ్డి మరియు నిర్మాత అచ్చిరెడ్డి వాళ్ళ సినిమాలో అవకాశం ఇచ్చారు..మంచి పేరు వచ్చింది..అక్కడి నుండి వాడు కెరీర్ లో బిజీ అయ్యేలోపు నా ఇద్దరి కొడుకులను వాడి క్రింద అసిస్టెంట్స్ గా పెట్టాను..అదే నేను నా జీవితం లో చేసిన పెద్ద తప్పు.

ఎప్పుడైతే వాళ్ళని అసిస్టెంట్స్ గా పెట్టానో అప్పటి నుండే వాళ్ళిద్దరి ఎదుగుదలకి అడ్డుకట్ట వేసిన దానిని అయ్యాను.. వేణు మాధవ్ బాగా ఎదిగిపోయాడు కానీ నా ఇద్దరు కొడుకులు మాత్రం అలాగే ఉండిపోయారు.. వేణు మాధవ్ బ్రతికి ఉంటె వాళ్ళిద్దరిని బాగా చూసుకునే వాడు, వేణు మాధవ్ కి ఒక చెడ్డ అలవాటు ఉంది.. ఎంత పెద్ద రోగం వచ్చినా మందులు వేసుకునేవాడు కాదు. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కూడా అలాగే చేసాడు.. అలా ప్రతిసారి చెయ్యడం వల్లే వాడి ప్రాణం మీదకు వచ్చింది. వేణు మాధవ్ కి సొంత ఇల్లులు మరియు ఫ్లాట్స్ ఉన్నాయి. వాటిల్లో వాడి కొడుకులు ఉన్నారు. నేను నా రెండవ కొడుకుతో అద్దె ఇంట్లో ఉంటున్నాను’ అని చెప్పుకొచ్చారు వేణు మాధవ్ తల్లి.