Janhvi Kapoor : మరోసారి ప్రియుడితో అడ్డంగా దొరికిన జాన్వీ..కారులో అలా..

- Advertisement -

Janhvi Kapoor : జాన్వీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన కూడా తన టాలెంట్ తో వరుస సక్సెస్లను అందుకుంటుంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే నార్త్ లో ఈ అమ్మడుకు సరైన హిట్ మాత్రం పడటం లేదు.. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. బికినీ ఫోటోలను పెడుతూ యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది..కాగా ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.. జాన్వీ బాయ్ ఫ్రెండ్ తో కారులో షికారు చేస్తూ అడ్డంగా కెమెరాలకు చిక్కింది.. అది కాస్త హాట్ టాపిక్ గా మారింది..

Janhvi Kapoor
Janhvi Kapoor

జాన్వీ కపూర్ శిఖర్ పహారియాతో ప్రేమాయణం నడిపిస్తుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడే ఈ శిఖర్. సినిమాల్లోకి రాకముందే శిఖర్ తో జాన్వీకి పరిచయం ఉంది.. ఆ పరిచయం ప్రేమగా మారిందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ కు వెకేషన్ కి వెళ్లడంతో నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది.

అంతేకాదు అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ నిశ్చితార్థంలోనూ సందడి చేశారు. తాజాగా ప్రియుడితో జాన్వీ మరోసారి అడ్డంగా దొరికింది. గత రాత్రి వీరిద్దరూ కరణ్ జోహార్ ఇంటికి వెళ్లారు. శిఖర్‌, జాన్వీ కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో అసలు విషయాన్ని జాన్వీ బయటపెట్టేసింది..

- Advertisement -
Janhvi Kapoor with boyfriend

ఇక సినిమాల విషయానికొస్తే.. సౌత్ లో పాగా వెయ్యాలని ప్రయత్నాలు చేస్తుంది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోయే ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని జాన్వీ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపుదిద్దుకోనున్న ఆర్సీ 16లోనూ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ వార్తలో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది.. జాన్వీ కపూర్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here