Saindhav : సైంధవ్ మూవీ స్టోరీ లీక్.. పాప కోసమే వెంకీ పోరాటమా..?

- Advertisement -

విక్టరీ వెంకటేశ్.. టాలీవుడ్​లో కుటుంబ కథాచిత్రాల నాయకుడంటే గుర్తొచ్చే పేరు ఆయనదే. ప్రతి ఫ్యామిలీలో కనీసం ఒక్కరైనా వెంకీ ఫ్యాన్స్ ఉంటారు. సెకండ్ ఇన్నింగ్స్​లో రొమాన్స్​ను పక్కన పెట్టి.. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు వెంకటేశ్. చాలా కాలం తర్వాత ఈయన ఓ యాక్షన్ మూవీతో సర్​ప్రైజ్ చేయడానికి వస్తున్నారు. హిట్‌’ లాంటి విజయవంతమైన సిరీస్‌ను అందించిన శైలేష్‌ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్​’ Saindhav పేరుతో వెంకీ తన 75వ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది సైంధవ్ చిత్రబృందం.

Victory Venkatesh Saindhav Movie

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్​ ​లుక్స్​ అదిరిపోయాయి. రెండు నిమిషాలు ఉన్న సైంధవ్ గ్లింప్స్ వీడియోలో వెంకటేశ్​ ఓ చేతిలో గన్‌ పట్టుకుని.. మరో చేతిలో ఓ ఇంజెక్షన్​ పట్టుకుని కనిపిస్తూ ‘నేనిక్కడే ఉంటాను.. ఎక్కడికీ వెళ్లను..’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నారు. ఈ గ్లింప్స్​ను క్లియర్​గా అబ్జర్వ్ చేస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ గ్లింప్స్ చూశాక కమల్ హాసన్ ‘విక్రమ్’ స్టైల్​లో వెంకీ లుక్​ ఉందని, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజీఎం కూడా ‘విక్రమ్’ టెంప్లేట్​ను గుర్తు చేస్తోందని అంటున్నారు.

Saindhav Glimpse

ఈ గ్లింప్స్​లో ఇవి కాకుండా అందరి దృష్టిని ఆకర్షించింది ఒకటి ఉంది. అది వెంకీ స్టైల్ కాదు.. బీజీఎం కాదు.. వెంకీ చేతిలో ఉన్న గన్ కాదు.. అదేంటంటే ఇంజెక్షన్. ఓ చేతిలో గన్.. మరో చేతిలో ఇంజెక్షన్ పట్టుకున్న వెంకీని చూస్తే.. ఈ మూవీ స్టోరీ అంతా ఆ ఇంజెక్షన్ చుట్టే తిరుగుతుందని నెటిజన్లు భావిస్తున్నారు.

- Advertisement -

ఈ గ్లింప్స్​లో మొదట వెంకీ బైక్ మీద ఉన్న ఓ బాక్స్ దగ్గరకు వెళ్తారు. ఆ బాక్స్ మీద ఓ సింబల్ ఉంది. దాని కింద Genezo అని రాసి ఉంది. ఇది జన్యువుల మీద పరిశోధనలు చేసే కంపెనీకి సంబంధించిన మెడిసిన్ బాక్స్! ఆ తర్వాత ఆ బాక్స్​ను ఓపెన్ చేసిన వెంకీ.. లిక్విడ్ ఉన్న ఓ వయల్​ను తీసి చేత్తో పట్టుకుంటారు. దాని మీద onasemnogene abeparvovec అని రాసి ఉంది. దీని గురించి గూగుల్​లో సెర్చ్​ చేస్తే.. SMA (Spine Muscular Atrophy) అనే వ్యాథికి వాడే జీన్ థెరపీ మెడికేషన్ అని తెలిసింది. ఈ మెడిసిన్​ను Zolgensma పేరుతో కూడా పిలుస్తారు.

ఈ ఇంజెక్షన్​ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రగ్స్​లో ఒకటి. దీని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.16కోట్లు. మనం ఈ పేర్లతో గూగుల్ సెర్చ్​ చేస్తే అనేక కథనాలు కూడా వస్తాయి. ఆ మధ్యలో చాలా మంది పసిపిల్లలు ఈ SMA వ్యాధితో పోరాడి కన్నుమూశారు. వారిలో చాలామందికి ఈ Zolgensma ఇంజెక్షన్​ను అందించినా ఫలితం దక్కలేకపోయింది. కొంతమంది మాత్రం ఈ ఇంజక్షన్​ ద్వారానే ప్రాణాలతో బయటపడ్డారు.

గ్లింప్స్​లో వెంకటేశ్​ ఈ డ్రగ్​ ద్వారా ఎవరినైనా చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా?.. ఆ చిన్నారి ఆయన కూతురా? ఈ క్రమంలోనే విలన్లతో పోరాడతారా?.. అసలీ కథ ఫాదర్​ అండ్ డాటర్​ సెంటిమెంట్​తో యాక్షన్​ నేపథ్యంలో తెరకెక్కనుందా? అనేది తెలియాల్సి ఉంది. గ్లింప్స్​లో డైలాగ్ కూడా… ‘నేను ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికీ వెళ్లను.. అంటూ ఆ పక్కన చాలా మందిని అప్పటికే వెంకటేశ్ కొట్టి పడేసి ఉంటారు. మరి విషయం ఏంటనేది సినిమా వస్తే గానీ క్లారిటీగా తెలియదు.

ఇక ఈ సినిమా టైటిల్ కాస్త స్టైలిష్​గా.. కొత్తగా అనిపిస్తోంది. కానీ ఇది మన పురాణాల నుంచి తీసుకున్న పేరే అని చాలా మందికి తెలియదు. మహాభారతం ప్రకారం కౌరవుల సోదరి దుస్సల భర్త పేరు సైంధవ్​. అంటే.. దుర్యోధనుడికి బావ. సైంధవుడికి శివుడు నుంచి పొందిన ఓ వరం ఉంటుంది. అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను అడ్డుకోగలిగే శక్తినిస్తాడు. ఆ వరం సాయంతో కౌరవులు.. పాండవులలోని అభిమన్యుడిని పద్మ వ్యూహంలోకి రప్పించి హతమారుస్తారు. ఆ సమయంలో సైంధవుడు.. మిగతా పాండవులని పద్మవ్యూహంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాడు. అలా అభిమన్యుడి మరణానికి కారణమవుతాడు సైంధవుడు.

అయితే నెగెటివ్ క్యారెక్టర్ పేరు టైటిల్ రోల్​కు ఎందుకు పెట్టారు? వెంకటేష్ పాత్రలో నెగెటివ్​ షేడ్స్ చూపిస్తారా? లేదా సైంధవుడు అందరికీ ఎలా అయితే అడ్డు పడగలడో? అలా ఎవరినైనా ఎదిరించి అడ్డుపడగలిగే సామర్థ్యం ఉన్నవాడిగా చూపించేందుకు వెంకీకి ఆ పేరు పెట్టారా? అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది.

ఈ గ్లింప్స్​ను ఇలా చాలా ఇంట్రెస్టింగ్​ పాయింట్స్​తో చూపించారు శైలేశ్ కొలను. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్​ నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్​ తర్వాత దర్శకుడు శైలేశ్ ఓ ట్వీట్ చేశారు. “ఇది ట్రిబ్యూట్‌ మాత్రమే కాదు. నేను వెంకటేశ్ గారి కోసమే దర్శకుడిగా మారానని అనిపిస్తుంటుంది. ఆయన్ని ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా చూపించాలని ఆశిస్తున్నాను. వెంకటేశ్, ఆయన అభిమానులు గర్వపడేలా శాయశక్తులా శ్రమించి ఈ సినిమా తీస్తా” అని అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here