Skanda : డిజాస్టర్ గా నిలిచిన స్కంద సినిమా.. అప్పుల పాలైన నిర్మాతలు.. ఎన్ని కోట్లు నష్టం అంటే?

- Advertisement -


Skanda : ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన సినిమా స్కంద. శ్రీలీల హీరోయిన్ గా నటించింది, సాయిమంజ్రేకర్ కీలకమైన పాత్రలో నటించింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ఫస్ట్ షో నుంచే సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమా టీడీపీ సభ్యులను, సానుభూతిపరులను ఆకర్షించింది తప్ప.. బోయపాటి కావాలని ఇలా రాయించారో లేక హీరో రామ్ ఏపీ గవర్నమెంట్ మీద ఉన్న కోపమో తెలియదు కానీ ఇలా ఇండైరెక్టుగా సర్కార్ పైన సెటైర్ వేసినట్లు తెలుస్తోంది. భూమ్..భూమ్ బీర్ల పైన.. నిద్రపోతున్న వారిని చంపడం నీకు అలవాటేమో.. కానీ నాకు లేపి చంపడం అలవాటు. ఇయ్యాలే పొయ్యాలి గట్టిగా అరిస్తే తోయాలి లాంటి డైలాగులు సైతం అందరికీ విసుగు తెప్పించేలా ఉన్నాయి.

Skanda
Skanda

ఏపీ, తెలంగాణ సీఎంల పైన చెప్పిన పలు రకాల డైలాగులు తెగ వైరల్ అవుతున్నాయి. సీన్ తో సంబంధం లేకుండా ఎందుకు ఆ డైలాగులు పేలుతున్నాయో అర్థం కాక ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. బయటికి వచ్చిన పలువురు నెటిజెన్లు ఇదేం సినిమా రా బాబు అని వాపోతున్నారు. కేవలం టీడీపీ కోసమే సినిమా తీశారన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మితిమీరిన విధంగా ఉండడంతో సినిమా పెద్దగా జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే స్కంద సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా స్కంద నిలిచింది. ఫస్ట్ డే రూ.10.57 కోట్లు కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. మొత్తంగా సినిమాకు రూ.47 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా ఇప్పటిదాకా కేవలం రూ.26 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాతకు లాభాలు రావాలంటే ఇంకో రూ.22 కోట్లు రాబట్టాల్సి ఉండగా.. అది వచ్చేది కష్టమే అని తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here