షాకింగ్.. OG Movie ని వదులుకున్న స్టార్ హీరో అతనేనా!

- Advertisement -

OG Movie : టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా నిలిచిన చిత్రం #OG.. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన రోజు సోషల్ మీడియా షేక్ అయ్యింది..ఇటీవలే ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది..అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది..భారీ యాక్టీవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాని #RRR మూవీ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

OG Movie
OG Movie

ఈ చిత్రం లో కాస్టింగ్ కూడా భారీగానే ఉంటుంది..ఇప్పటికే కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ని ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అడిగాడట డైరెక్టర్ సుజిత్..అతని గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు..అంతే కాకుండా బాలీవుడ్ పాపులర్ సీనియర్ హీరోయిన్ టబు మరియు అనుపమ్ ఖేర్ కూడా ఈ చిత్రం నటించబోతున్నట్టు సమాచారం.

OG Movie Opening

ఇది ఇలా ఉండగా #OG గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తి విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది..అదేమిటి అంటే ఈ సినిమాని తొలుత సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యాలనుకున్నాడట సుజిత్..మహేష్ బాబు కూడా ఈ స్టోరీ బాగా నచ్చింది..కానీ వరుసగా రెండు మూడు సినిమాలకు అప్పటికే మహేష్ బాబు కమిట్ అయిపోయి ఉండడం తో భవిష్యత్తులో చేద్దాం అని సుజిత్ కి చెప్పాడట మహేష్ బాబు.

- Advertisement -
Mahesh Babu Sujeeth

అలా ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యేలోపు మహేష్ బాబు నుండి పవన్ కళ్యాణ్ కి చేతులు మారింది.. గతం లో పవన్ కళ్యాణ్ చెయ్యాల్సిన అతడు మరియు పోకిరి వంటి సినిమాలను పవన్ కళ్యాణ్ వదులుకోగా మహేష్ బాబు చేసాడు.. ఆ రెండు సినిమాలు మహేష్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి..ఇప్పుడు #OG చిత్రం పవన్ కళ్యాణ్ కి కూడా అదే విధంగా కలిసి వస్తుందో లేదో చూడాలి.

Pawan Kalyan Mahesh Babu
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here