టాలివుడ్ లో లవ్లీ ఫెయిర్ అంటే Mahesh Babu నమ్రత పేర్లు వినిపిస్తాయి.మిస్ ఇండియా అవ్వడమే కాదు.. బాలివుడ్ లో వరుస సినిమాలు కూడా చేస్తూ వస్తుంది. అప్పుడే తెలుగులో మహేష్ సరసన వంశీ సినిమా చేసింది.ఆ సినిమా టైం లోనే వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి దాకా వెళ్లారు. హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే నమ్రత మహేష్ బాబును పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లోనే బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. నమ్రత బర్త్డే సందర్భంగా మహేష్ బాబు బర్త్ డే విషేస్ తెలిపారు. హ్యపీ బర్త్ డే ఎన్ఎస్జీ అని పెట్టాడు. అంటే దాని అర్థం నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని.నమ్రత అంటే ఎందుకు అంత ఇష్టం అనేది కూడా మహేష్ చెప్పారు..
నా కోసం అన్ని పనులను చాలా లైన్లో, క్రమంగా పెడుతున్నందుకు ధన్యవాదాలు. నన్ను ఎప్పటకీ మరింత ముందుకు నడిపిస్తున్నందుకు ఎప్పుడూ నువ్వు నీలాగానే ఉన్నందుకు థాంక్స్ అంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఈ మెసేజ్ కు నమ్రత అందమైన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా గౌతమ్, సితార, మహేష్ ల గురించి ఆసక్తి విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక నమ్రత మహేష్ లైఫ్ లోకి వచ్చాక కెరీర్ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మహేష్ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.. అందుకు కారణం అతని భార్యే..ఈ విషయం గురించి మహేష్ చాలా ఇంటర్వ్యూ లలో చెప్పారు..
సినిమా కథలు వినడం, డేట్ లు చూసుకోవడం, సినిమా ప్రమోషన్స్ లాంటివి చూసుకుంటూ లైఫ్ నీ సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ అంతకుముందే అతడు, ఖలేజా సినిమాలో వచ్చాయి. ఇప్పుడు రాబోయేది మూడవ సినిమా. త్రివిక్రమ్ తో సినిమా పూర్తి అయ్యాక టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూన్నారు.. ఆ సినిమా మహేష్ బాబు ఎలా టర్న్ చేస్తుందో చూడాలి…