విజ‌య్ ద‌రిద్రం ర‌ష్మిక‌కు.. విజయ్ – రష్మికల రిలేషన్ పై Venu Swamy సంచలన వ్యాఖ్యలు.. అమ్మబాబోయ్..Venu Swamy : గీతాగోవిందం సినిమాతో మంచి టాక్ ను అందుకున్నారు.. ఆ సినిమాతో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటి నుంచి వారిద్దరూ కలిసి తిరుగుతున్నారు.. ఈ మధ్య వీరిద్దరూ కలిసి ట్రిప్ లకు వెళుతున్నారు. అక్కడ కెమెరాలకు చిక్కుతున్నారు.. తాజాగా దుబాయ్ లో ఇద్దరు వేకేషన్ ను ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు.

అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇకపోతే వీరిద్దరి రిలేషన్ గురించి ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటివరకు అయన చెప్పినవి నిజం కావడం తో వీరిద్దరి విషయంలో నిజం అవుతుందని నమ్ముతున్నారు.

Venu Swamy
Venu Swamy

ఈయన తరచూ సినీ, రాజకీయ ప్రముఖలపై జ్యోతిష్యం చెబుతుంటారు. అయితే ఈయన చెప్పిన విషయాల్లో చాలా వరకు నిజం అవ్వడంతో వేణు స్వామిపై మాటలపై నమ్మకం పెరిగింది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఈయన బాగా పాపులర్ అయిపోయాడు.అయితే తాజాగా ఈయన టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో జనాల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రియల్ లైఫ్ లోనూ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే..

Vijay Deverakonda - Rashmika
Vijay Deverakonda – Rashmika

విషయానికొస్తే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రష్మిక, విజయ్ దేవరకొండ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..రష్మిక మందన్నాకు వద్దని చెప్పినా వినకుండా విజయ్‌ దేవరకొండతో లవ్‌ ఎఫైర్ పెట్టుకుంది. ఫలితంగా విజయ్‌కు ఉన్న దరిద్రం ఆమెకు పట్టుకుంది. లైగర్‌ సినిమా ప్లాప్‌ అవుతుందని ముందే చెప్పా అలాగే జరిగింది. ఇప్పుడు రష్మిక వరుస వివాదాల్లో చిక్కుకోవడానికి కారణం విజయ్ తో ఎఫైర్ పెట్టుకోవాడమే.

కన్నడ ఇండస్ట్రీలో ఆమెను బ్యాన్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే సౌత్ లోని మిగిలిన భాషల్లో కూడా రష్మికపై నెగెటివిటీ ఏర్పడుతోంది.. దీంతో ఈయన వాఖ్యలు కాస్త నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఈ ఇంటర్వ్యూ పాతదే అయిన ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది..