‘జవాన్’ మూవీ ఫుల్ రివ్యూ.. షారుఖ్ ఖాన్ మాస్ విశ్వరూపం మామూలు రేంజ్ లేదు!

- Advertisement -

నటీనటులు : షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి, నయనతార, ప్రియమణి, శాన్వీ తదితరులు

సంగీతం : అనిరుద్
నిర్మాత : గౌరీ ఖాన్
బ్యానర్ : రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం : అట్లీ

వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చాలా కాలం వరకు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఈ ఏడాది ప్రారంభం లో ‘పఠాన్’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. షారుఖ్ ఖాన్ సరైన హిట్ కొడితే ఇలా ఉంటుంది అని ప్రతీ ఒక్కరికి ఈ చిత్రం తో అర్థం అయ్యేలా చేసాడు ఈ సూపర్ స్టార్. సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన చిత్రమ్ ‘జవాన్’. ఈ చిత్రానికి తమిళ టాప్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు. టీజర్, ట్రైలర్ మరియు పాటలు ఇలా ప్రతీ ఒక్కటి విడుదలకు ముందే ఎంతో అఆకట్టుకునేలా చేసిన ఈ చిత్రం, నేడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , హిందీ మరియు తమిళం భాషల్లో ఘనంగా విడుదలైంది. మరి ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం.

- Advertisement -
జవాన్
జవాన్

కథ :

ఇండియన్ బోర్డర్ వద్ద తీవ్రమైన గాయాలతో దొరికిన ఒక గుర్తు తెలియని వ్యక్తిని (షారుఖ్ ఖాన్) ఒక తల్లి బిడ్డ కాపాడుతారు. అతని శరీరం మొత్తం తీవ్రమైన గాయాలతో నిండిపోయి ఉంటుంది, కొనఊపిరి తో కొట్టుమిట్టాడుతున్న అతనికి వైద్యం చేసి బ్రతికిస్తారు, కానీ అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. ఒకానొక సందర్భం అతను ఉంటున్న ఊర్లోకి కొంత మంది దుర్మార్గులు మారణాయుధాలతో దాడి చేస్తూ అందరినీ హతమారుస్తు ఉంటారు. సరిగ్గా ఆ సమయం లోనే ఆ వ్యక్తి కోమాలో నుండి కోలుకొని దాడి చెయ్యడానికి వచ్చిన దుండగులను చీల్చి చెండాడి ఆ గ్రామా ప్రజలను కాపాడుతాడు. అప్పటి నుండి అందరూ అతనిని దేవుడితో సమానంగా కొలవడం ప్రారంభిస్తారు. కానీ ఆ వ్యక్తికి తానూ ఎవరు అనే విషయం గుర్తుకు రాదు. తనని కాపాడిన ఆ చిన్న పిల్లాడిని నేనెవరిని అని అడుగుతాడు, అప్పుడు ఆ పిల్లవాడు నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ కచ్చితంగా నీ గురించి మొత్తం తెలుసుకొని నీకు చెప్తాను అని అంటాడు. ఈ సంఘటన జరిగిన 30 ఏళ్లకు విక్రమ్ రాథోడ్ (షారుఖ్ ఖాన్) అనే జైలర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలపై వ్యతిరేకంగా రాబిన్ హుడ్ తరహాలో పోరాడుతుంటాడు. కాళీ (విజయ్ సేతుపతి) వద్ద ఉన్న డబ్బులను మొత్తం దోచేసి పేద ప్రజలకు పంచి పెడుతాడు. ఇంతకీ ఈ విక్రమ్ రాథోడ్ ఎవరు?, 30 ఏళ్ళ క్రితం బోర్డర్ లో తీవ్రమైన గాయాలతో దొరికిన వ్యక్తి ఇతనేనా..?, ఎందుకు ఇలా ప్రభుత్వం పై పోరాడుతున్నాడు? వంటివి తెలియాలంటే జవాన్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

సమాజం లో జరుగుతున్నా అన్యాయాలను భరించలేక హీరో వ్యవస్థ పై పోరాటం చెయ్యడం అనేది మనం చిన్నప్పటి నుండి శంకర్ సినిమాల్లో చూస్తూనే ఉన్నాము. ఈ సినిమా కూడా అలాంటిదే. కానీ ఇప్పటి వరకు ఎవ్వరు టచ్ చెయ్యని సామజిక అంశం ని ఈ చిత్రం లో చూపించాడు డైరెక్టర్ అట్లీ. ఇండియన్ ఆర్మీ కి ఎందుకు పనికి రాని రైఫిల్స్ ని సరఫరా చేసే ఒక కార్పొరేట్ కంపెనీ పై ఒక జవాన్ చేసే పోరాటమే ఈ జవాన్. కేవలం ఆ ఒక్క అంశాన్ని మాత్రమే కాకుండా, సమాజం లో జరిగే వివిధ అంశాలను టచ్ చేస్తూ చాలా చక్కగా ఈ చిత్రాన్ని తీసాడు డైరెక్టర్ అట్లీ. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే ఈ సినిమాలో పడినంత మాస్ ఎలివేషన్ సన్నివేశాలు ఏ చిత్రం లో కూడా పడలేదు అనే చెప్పాలి. ముఖ్యంగా పరిచయ సన్నివేశం తో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పిస్తాడు డైరెక్టర్ అట్లీ.

ఆ పరిచయ సన్నివేశం చూస్తే ఎలాంటి వాడికైనా రోమాలు నిక్కపొడవాల్సిందే, అలా జెట్ స్పీడ్ స్క్రీన్ ప్లే తో ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం అదే రేంజ్ స్పీడ్ తో వెళ్తుంది. ఇక ఇంటర్వెల్ సన్నివేశానికి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవుతాది, ఆ రేంజ్ ట్విస్ట్ ని పెడుతాడు డైరెక్టర్ అట్లీ. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభం లో కాస్త స్లో అయ్యినప్పటికీ, కంటెంట్ లో ఎమోషన్ పాళ్ళు బలంగా ఉండడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వరు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో షారుఖ్ ఖాన్ జాతిని ఉద్దేశించి ఇచ్చే ప్రసంగం సినిమాకి ప్రధానమైన హైలైట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకి ఆరోప్రాణం లాగ నిల్చింది అనిరుధ్ సంగీతం. డైరెక్టర్ టేకింగ్ తో పాటుగా, అనిరుధ్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతీ సన్నివేశం ని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసింది. ఇక డ్యూయల్ రోల్ లో షారుఖ్ ఖాన్ ఈ చిత్రం ద్వారా నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ లుక్ లో ఉన్న షారుఖ్ ఖాన్ పాత్ర చాలా కాలం వరకు గుర్తుండిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. నయనతార, ప్రియమణి తమ పాత్రల పరిధిమేర చాలా చక్కగా నటించారు. ఇక విలన్ గా విజయ్ సేతుపతి తన డిఫరెంట్ మ్యానరిజమ్స్ తో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. దీపికా పదుకొనే పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

చివరి మాట :

కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరిన మాస్ మసాలా చిత్రం. షారుఖ్ ఖాన్ ని ఇంత మాస్ గా కెరీర్ మొత్తం లో ఎవ్వరూ చూసి ఉండరు. ఈ చిత్రానికి పఠాన్ కంటే ఎక్కువ రేంజ్ వసూళ్లు రాబట్టే సత్తా ఉంది.

రేటింగ్ : 3.25/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here