Allu Arjun : సైకిల్ షాపులో పంచర్లు వేసుకునే మొఖపోడా.. నాగబాబు పై అల్లు అర్జున్ సెన్సేషనల్ ట్వీట్

- Advertisement -

Allu Arjun : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. అల్లు అర్జున్ మాత్రం పవన్ కోసం ఒక ట్వీట్ తో సరిపెట్టాడు. అంతటితో ఆగకుండా వైసిపి అభ్యర్థి కోసం నంద్యాలకు వెళ్లడం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మెగా ఫ్యామిలీలో ఇది తీవ్ర అసంతృప్తికి కారణమైంది. మరో రెండ్రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి అనగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున ప్రచారం చేశారు. అంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసినా, వైసిపి అభ్యర్థి కోసం నేరుగా ప్రచారానికి నంద్యాల వెళ్లడం ఇటు జనసేన పార్టీ నేతలకు.. అటు మెగాభిమానులకు అస్సలు నచ్చలేదు. దీనిపై అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.

ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న అల్లు అర్జున్ పోలింగ్ ముగిసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. తనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుందంటూ పేర్కొన్నారు. మా మామయ్య పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. నంద్యాలలో రవికి కూడా అలాగే మద్దతు తెలిపానని, నాకు దగ్గర వ్యక్తులు ఎవరైనా సరే రాజకీయంగా మద్దతు ఇవ్వాల్సి వస్తే తప్పక ఇస్తానన్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు.

- Advertisement -

అయితే తాజాగా నాగబాబు ఎన్నికలు ముగిసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పేరు పెట్టకుండా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.. మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ పోస్ట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ అని పలువురు జనసైనికులు భావిస్తున్నారు. ఈ ట్వీట్ కు అల్లు అర్జున్ రిప్లయ్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ‘అల్లు రామలింగయ్య లేకపోతే నాగబాబు బాపట్ల పోస్ట్ ఆఫీస్ ముందున్న సైకిల్ షాప్ లో పంచర్లు వేసుకునేటోడు’ అన్నట్లు ఉన్న పోస్ట్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఐతే ఈ పోస్ట్ అల్లు అర్జున్ పెట్టలేదని.. ఆయన అకౌంట్ హ్యాక్ అయిందని కొందరు అంటుంటే.. అలా కావాలనే డిజైన్ చేశారని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ రాజకీయంగా రచ్చ లేపుతుంది. ఇది ఇలా ఉంటే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది అన్న విషయం జనాల్లో చర్చనీయాంశమైన విషయమే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here