Hero Jai : హీరోయిన్ అంజలితో ప్రేమ.. సైలెంట్ గా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న హీరో

- Advertisement -

Hero Jai : తమిళ్ హీరో జై గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జర్నీ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆ సినిమాలో తనతో పాటు నటించిన మన తెలుగు అమ్మాయి అంజలితో కొన్నేళ్లు ప్రేమాయణం నడిపాడు. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవడం కూడా ఖాయమని అంతా భావించారు. అయితే అనుకోకుండా వీరిద్దరూ ఎవరి దారి వారు ఎంచుకున్నారు. ఒకపక్క అంజలి వరుసగా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతుంది.. మరో పక్క జై కూడా వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా మరో హీరోయిన్ ప్రగ్యా నగారాతో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేసి ఒక్కసారిగా వారి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు జై.

హీరోయిన్ ప్రగ్యా నగారా తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. ఆమె మెడలో మంగళసూత్రం ధరించి ఉండగా పక్కనే ఆమెకు బాగా దగ్గరగా ఉన్న జై తన చేతిలో రెండు పాస్పోర్ట్ లు, ఫ్లైట్ టికెట్స్ తో కనిపించాడు. దేవుడి దయతో కొత్త జీవితం స్టార్ట్ అయిందంటూ ఇద్దరూ ఒకే ఫోటోని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని హనీమూన్ కి చెక్కేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వీరిద్దరికి వారి వారి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

- Advertisement -

అయితే తమిళ సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఇదంతా ఒక మూవీ ప్రమోషన్ కోసమే అని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి బేబీ అండ్ బేబీ అనే ఒక సినిమా చేస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ నడుస్తోంది. ఈ సినిమాలో హీరోగా జై నటిస్తుండగా హీరోయిన్ గా ప్రగ్యా నటిస్తోంది. సత్యరాజ్, యోగి బాబు వంటి వాళ్ళు ఇద్దరు కీలకపాత్రలలో నటిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ ఒక్కసారిగా మొదలుపెట్టే కంటే ఇలా ఏదైనా భిన్నంగా ప్లాన్ చేయాలనే ఇలా ఫొటో రిలీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది వారిద్దరూ చెబితే గానీ తెలియదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here