Samyuktha Menon : రెడ్ శారీలో మెస్మరైజ్ చేస్తోన్న సంయుక్త మేనన్



samyuktha menon : మలయాళ కుట్టి సంయుక్త మేనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. ఈ బ్యూటీ టాలీవుడ్ లో మొదటి సినిమా ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ భీమ్లా నాయక్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రానాకు జోడీగా నటించింది. 

Samyuktha Menon
Samyuktha Menon

ఈ సినిమాలో సంయుక్త అందం, అభినయానికి టాలీవుడ్ ఫిదా అయింది. అందుకే ఆ తర్వాత బింబిసారలో ఛాన్స్ వచ్చింది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో సంయుక్త పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు. అయినా కనిపించిన కాసేపు ఈ భామ తన అందం, నటనతో ఆకట్టుకుంది.

Samyuktha Menon Saree Photos

బింబిసార తర్వాత ఈ భామకు సరైన అవకాశాలు రాలేదు. తాజాగా ధనుష్ తో సార్ లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ సంయుక్త సందడి చేసింది.

Samyuktha Menon Red Saree Photos

సార్ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు సంయుక్త రెడ్ శారీలో సంప్రదాయ బద్ధంగా వచ్చింది. శారీలో కూడా సంయుక్త చాలా హాట్ గా కనిపించింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

Samyuktha Menon latest photos

రెడ్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో.. సింపుల్ నెక్లెస్ ధరించి.. కూల్ ఇయర్ రింగ్స్ తో సంయుక్త ఎంత ముద్దుగా రెడీ అయిందో. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ సంయుక్తదే. శారీలో కూడా సంయుక్త సూపర్ హాట్ గా ఉందంటూ సోషల్ మీడియాలో కుర్రాళ్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Samyuktha Menon Teaser Launch

ఎంతైనా అమ్మాయిలు శారీలో ఉన్నంత అందంగా ఇంకే ఔట్ ఫిట్ లో కనిపించరు అంటూ కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాతో.. ఇక సంయుక్త టాలీవుడ్ లో జెండా పాతేసినట్టేనని మాట్లాడుకుంటున్నారు. తెలుగు తెరను ఏలడానికి మరో మలయాళ కుట్టి సంయుక్త మేనన్ వచ్చేసిందంటూ గుసగుసలాడుతున్నారు.