Hyper Aadi : పవన్ కళ్యాణ్ కోసం ‘ఢీ’ షోని వదిలేసిన హైపర్ ఆది..వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్

- Advertisement -

Hyper Aadi : జబర్దస్త్ షోలో కమెడియన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న హైపర్ ఆదికి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ రేంజ్ లో అవకాశాలు వస్తున్నాయి. బుల్లితెర ఆడియన్స్ కి మరియు వెండితెర ఆడియన్స్ కి ప్రస్తుతం హైపర్ ఆది కామెడీనే కావాలి.రీసెంట్ గా విడుదలైన మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ చిత్రం లో కూడా మెయిన్ కమెడియన్ గా హైపర్ ఆది పండించిన కామెడీ ఆ సినిమా సక్సెస్ కి కీలకంగా మారింది.

Hyper Aadi
Hyper Aadi

ఆటో పంచులకు పెట్టింది పేరులాగా ఉండే హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక రీసెంట్ గా తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సార్’ మూవీ లో కూడా హైపర్ ఆది కమెడియన్ గా నటించాడు, ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా హైపర్ ఆది ‘సార్’ చిత్ర నిర్మాత నాగ వంశీ గురించి మాట్లాడుతూ ‘అర్జున్ రెడ్డి క్యారక్టర్ ఫిక్షనల్ అయ్యుండొచ్చు, కానీ నాగ వంశీ క్యారక్టర్ రియల్ లైఫ్ లో అర్జున్ రెడ్డి రేంజ్ లో ఉంటుంది.ఏదైనా ముక్కుసూటిగా మొహం మీదనే మాట్లాడడం నాగవంశీ తత్త్వం, త్రివిక్రమ్ గారి పక్కనే ఎప్పుడూ ఉండడం వల్ల ఆయన దగ్గర నుండి పంచులు కూడా వెయ్యడం నేర్చుకున్నాడు.

- Advertisement -
Hyper Aadi Pawan Kalyan

నాగ వంశీ కి నాకు మధ్య జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజు నేను మీకు చెప్పాలి, భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయం లో నాకు ‘ఢీ’ షూటింగ్ కూడా ఉన్నింది, ‘ఢీ’ కోసం ఒక హాఫ్ డే లీవ్ కావాలని నాగ వంశీ ని అడిగితే ఆయన నీకు ఢీ షో కావాలా లేదా పవన్ కళ్యాణ్ సినిమా కావాలా అని అడిగాడు, ఆ మాట అడిగిన తర్వాత నా చేతులు జోబులో పెట్టుకొని నడుచుకుంటూ భీమ్లా నాయక్ షూటింగ్ లో పాల్గొన్నాను’ అని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here