Prabhas : పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ కేవలం బాలీవుడ్ హీరోయిన్లతో రొమాన్స్ చేసేందుకే ఇష్టపడుతున్నాడా… అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే బాహుబలి తర్వాత ఈ హీరో నటించిన చిత్రాల్లో దాదాపుగా బీ టౌన్ బ్యూటీసే ఉండటం దీనికి ఓ కారణం. బాహుబలి తర్వాత వచ్చిన మూవీ సాహోలో.. బీ టౌన్ భామ శ్రద్ధా కపూర్ నటించింది. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ లో టాలీవుడ్ లో నటించినా.. నేటివ్ మాత్రం బాలీవుడే అయిన పూజా హెగ్డే.. దాని తర్వాత ఆదిపురుష్ లో హిందీ భామ కృతి సనన్.. ఇక ఇప్పుడు తీస్తున్న కల్కిలోనూ దీపికా పదుకోణె, దిశా పటానీ.. ఇద్దరూ బాలీవుడ్ భామలే. దీన్ని బట్టి ప్రభాస్ ఛాయిస్ బీ టౌన్ కే ఓటేస్తున్నట్లు కనిపిస్తుంది కదా. అయితే ఇటీవల వచ్చిన సలార్ పార్ట్-1లో మాత్రం మిస్ అయిందని అనుకునేలోగానే ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..?
ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ‘సలార్ పార్ట్- 1’ గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన ఈ మూవీ డార్లింగ్ ప్రభాస్‌కు సూపర్ సక్సెస్ అందించింది. తొలి భాగానికి కొనసాగింపుగా ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రెండో పార్ట్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ షూటింగ్ కూడా రీసెంట్గా ప్రారంభమైంది. ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. పార్ట్-2లో ఓ బాలీవుడ్ హీరోయిన్ నటిస్తోందట. ఇంతకీ ఆమె ఎవరంటే..?
బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అడ్వాణీ సలార్ – పార్ట్ 2లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుందట. పార్ట్-2లో ఆమె డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కియారాతో ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. కానీ, కియారా పాత్ర సెంకడ్ హాఫ్‌లో ఎంట్రీ ఇస్తుందని టాక్. ఇక ప్రభాస్- కియారా జోడీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేస్తుంటే క్రేజీగా ఉంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తొలి పార్ట్‌లో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిచిగా.. రెండో పార్ట్‌లో కూడా ఆమె కొనసాగనుంది. సలార్ పార్ట్-1లో శ్రుతి హాసన్‌కు పెద్దగా డైలాగులు, స్క్రీన్ టైమ్ ఇవ్వలేదు. సినిమా మొత్తం ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్పైనే సాగింది. మరి సీక్వెల్లోనైనా ప్రశాంత్ హీరోయిన్లకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తారో చూడాలి. తొలిపార్ట్‌లో సీనియర్ నటుడు జగపతిబాబు, శ్రేయా రెడ్డి, ఈశ్వరీ రావు తదితరులు నటించారు. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ.700+ కోట్లు వసూల్ చేసింది.