Sonali Bendre : పదేళ్ల తర్వాత ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వబోతున్న మహేశ్ హీరోయిన్

- Advertisement -

Sonali Bendre : ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేసి తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సొనాలీ బింద్రే. సూప‌ర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మురారి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది సొనాలీ.. ఆ త‌ర్వాత తెలుగులో ఇంద్ర, ఖ‌డ్గం, మ‌న్మ‌ధుడు, శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ లాంటి హిట్ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఆమెకు క్రేజ్ మాత్రం బాగానే ఉంది.

Sonali Bendre
Sonali Bendre

అయితే, 2018లో క్యాన్సర్ బారినప‌డి కోలుకున్న సొనాలీ బింద్రే .. ప్ర‌స్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల‌ ప్రముఖ బ్రిటీష్ టెలివిజ‌న్ సిరీస్ ‘ప్రెస్’ ఆధారంగా తెర‌కెక్కిన ‘ది బ్రోకెన్ న్యూస్’ వెబ్‌ సిరీస్‌లో సోనాలి బింద్రే తిరిగి ఆరంగేట్రం చేశారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా సోనాలి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

జూనియర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా దేవరలో ఈ మాజీ హీరోయిన్ ఓ కీల‌క‌ పాత్ర‌ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వ‌ర్గాలు కోడై కూసాయి. ఆమె ఇందులో సినిమాను మలుపు తిప్పే పాత్రలో సోనాలి నటిస్తారని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆ ఈ వార్తలపై సోనాలి స్పందించారు. తాను నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై ముందుగా ఆమె షాక్ అయ్యారు. ఆ త‌ర్వాత‌ సోనాలి మాట్లాడుతూ.. నో.. నాకు దీని గురించి అస్స‌లు తెలియదు.. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇది ఫేక్ న్యూస్ అంటూ సోనాలి బింద్రే క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -


సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ రంగుల ప్రపంచంలోకి సోనాలి బింద్రే అడుగుపెట్టారు. పలు రియాలిటీ షోలలో జడ్జ్‌గా చేసింది. అయితే, ఇప్పుడు జీ5 వేదికగా మే 3 నుంచి ప్రసారం కానున్న ‘ది బ్రోకెన్ న్యూస్‌ సీజన్‌ 2’వెబ్‌ సిరీస్‌లో కనిపించనున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సొనాలి తాను 2013 నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఇప్పుడు ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా కారణం ఉందంటూ చెప్పుకొచ్చారు. ‘ఇప్పుడు నాకు కూడా డబ్బు అవసరం ఉంది. నేను చెల్లించాల్సిన బిల్లులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. అందుకోసం నేను పని చేయవలసి ఉంది. నా కుటుంబం కూడా చాలా క్లిష్టమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందంటూ చెప్పుకొచ్చారు. చాలా ఏళ్ల తర్వాత తమ అభిమాన తార రీఎంట్రీ ఇస్తుండడంత ఫ్యాన్స్‌ కూడా గ్రాండ్‌గా స్వాగతం పలుకుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here