Remake movies : 2022 రీమేక్​ మూవీస్​లో హిట్, ఫ్లాప్​ ఎన్నో తెలుసా..?

- Advertisement -

Remake movies : డిసెంబర్ వచ్చేసింది. 2022 ఏడాది ముగింపు మొదలైంది. ఈ ఇయర్​ కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా అలా అలా సాగిపోయింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ ఏడాది మిక్స్​డ్ ఫలితాలను మిగిల్చింది. ఈ సంవత్సరం అగ్ర హీరోల నుంచి యంగ్ హీరోల వరకు చాలా మంది రీమేక్​లపై ఆధారపడ్డారు. కొందరికి రీమేక్​లు సక్సెస్​ను అందిస్తే.. మరికొందరికి పరాజయాన్ని రుచిచూపించాయి.

God father
God father

ఈ ఏడాది టాలీవుడ్​ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సినిమాల్లోనూ రీమేక్‌ల హవా బాగానే ఉంది. చాలా మంది రీమేక్​ అంటే కాపీ పేస్ట్​ అంటూ విమర్శలు చేస్తుంటారు. కానీ అవి రూపొందించాలంటే పరభాషలో సినిమా విజయానికి కారణాలు ఏంటి, మన భాషలో విజయం సాధించడానికి అవసరమైన అంశాలు ఏంటి అని లెక్కలు వేసుకుని తీయాలి. ఈ ఏడాది వచ్చిన రీమేక్స్ ఎన్ని, అందులో హిట్లు ఎన్ని, పరాజయాలో తెలుసుకుందామా..?

Bheemla naik
Bheemla Naik

ఈ ఏడాది వచ్చిన రీమేక్​లలో మెగా కాంపౌండ్​ నుంచే ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి. విచిత్రమేంటంటే.. ఈ మూడు రీమేక్​లో బాక్సాఫీస్​ను షేక్ చేశాయి. హీరోలకు రికార్డుల పంట పండించాయి. మలయాళ మూవీ లూసిఫర్ రీమేక్​ గాడ్​ ఫాదర్​తో మెగాస్టార్ చిరంజీవి  ఆచార్య ఫ్లాప్ నుంచి బయటపడ్డారు. మరోవైపు మలయాళీ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్​ రీమేక్​ భీమ్లా నాయక్​తో పవన్ కల్యాణ్ మరోసారి రఫ్ఫాడించాడు.

- Advertisement -
Urvashivo Rakshasivo
Urvashivo Rakshasivo

ఇంకోవైపు తమిళ్ సినిమా ప్యార్ ప్రేమ కాదల్ రీమేక్​ ‘ఊర్వశివో రాక్షసివో‘ అంటూ అల్లు శిరీష్ తన ఖాతాలో ఓ సూపర్ హిట్ మూవీని వేసేసుకున్నాడు.

Ori devuda
Ori devuda

టాలీవుడ్​ మాస్​ కా దాస్ విశ్వక్​సేన్​కు సూపర్ హిట్​ను అందించింది ఓరి దేవుడా మూవీ. తమిళంలో ఓ మై కడవలే సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ దేవదూతగా నటించారు. ఈ మూవీ ఆశించినంత ఆడకపోయినా.. మీడియం రేంజ్ వసూళ్లు రాబట్టింది.

Remake movies

మరోవైపు సీనియర్ హీరో రాజశేఖర్ మలయాళం మూవీ జోసెఫ్​ను తెలుగులో శేఖర్​గా రీమేక్ చేశారు. తన సతీమణి జీవిత రాజశేఖర్ డైరెక్షన్​లో వచ్చిన ఈ సినిమా డీసెంట్ టాక్​ను సొంతం చేసుకుంది.​

ఈ ఏడాది రీమేక్​ మూవీస్​లో శాకిని డాకిని సినిమా కాస్త స్పెషల్. ఎందుకంటే ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. అందులోనూ మల్టీ హీరోయిన్స్​తో చేసిన సినిమా. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్​కు రీమేక్. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ ఈ ఏడాది నటించిన సినిమా దొంగలున్నారు జాగ్రత్త. ఈ సినిమా స్పానిష్ మూవీ 4×4 నుంచి ప్రేరణ పొంది తీసిందని టాక్. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్న శ్రీసింహకు ఈ మూవీ మంచి ప్రశంసలు తెచ్చిపెట్టింది.

Repeat
Repeat

నవీన్ చంద్ర హీరోగా నటించిన మూవీ రిపీట్. డిస్నీ ప్లస్ హాట్​స్టార్ వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ మూవీ డెజావుకు రీమేక్.

Gurtundaseethakalam
Gurtundaseethakalam

ఈ శుక్రవారం విడుదల కానున్న సినిమాల్లో గుర్తుందా శీతాకాలం ఒకటి. ఇది కన్నడ మూవీ లవ్ మాక్​టైల్​కు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొన్నిమార్పులు చేసినట్లు హీరో సత్యదేవ్ చెప్పాడు. ఇందులో తమన్నా, మేఘా ఆకాష్, కావ్యా శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here