Ballaya : ఆ హీరోయిన్ తో అది కావాలంటున్న బాలయ్య..ఆ కోరికతోనే..

- Advertisement -

Ballaya : నందమూరి నట సింహం బాలకృష్ణ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరూ కూడా ఉండరు..కేవలం సినిమాల్లో, రాజకియాల్లో బిజిగా ఉండే బాలయ్య టీవీ షోలతో జనాలకు ఆనందాన్ని పంచుతున్నారు. ఆఁహా లో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో ద్వారా బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు..ఈ షోలో భాగంగా తన కోరికను బయట పెట్టారు.. మొన్నీమద్య జయప్రద, జయసుధలతో పాటు రాశి ఖన్నా అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు భామల నుంచి బాలయ్య ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రాబట్టారు. ఈ క్రమంలోనే జయసుధ జయప్రదలు కలిసి బాలయ్యను కొన్ని ప్రశ్నలు వేశారు..

Bala krishna
Ballaya

అందులో భాగంగా మీ నెక్స్ట్ సినిమాలో కృతి సనన్ ఆలియా భట్, దీపికా పదుకొనే లో ఎవరిని హీరోయిన్ గా పెట్టుకుంటారని అడగ్గా.. బాలయ్య దిమ్మతిరిగి పోయే సమాధానం చెప్పారు. ఆలియా భట్ కు పెళ్లి అయిపోయి పాప పుట్టింది, దీపికకు కూడా పెళ్లి అయిపోయింది, కృతి సనన్‌ ఖాళీగా ఉంది కాబట్టి ఆమెనే నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా తీసుకుంటాను అంటూ బాలయ్య పేర్కొన్నారు. ఆ మాట అన్నారో లేదో కానీ కామెంట్స్‌ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Kriti Sanon
Kriti Sanon

పెళ్లి కాని కృతి సనన్‌నే హీరోయిన్‌గా కావాలంటున్న బాలయ్య కోరిక తీరుతుందా లేదా అన్నది చూడాలి..బాలయ్య నెక్స్ట్ అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్నారు.. ఆ సినిమాలో కృతిని దించుతారెమో చూడాలి.. అయితే, కృతి సనన్‌ చాలా కాలం తర్వాత తెలుగులో ఆదిపురుష్‌ ప్రాజెక్టుకు సైన్‌ చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..

- Advertisement -
Veerasimha Reddy
Veerasimha Reddy

ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే..గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్‌ తదితరులు కీలకపాత్రలను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ తర్వాత బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది..త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని సమాచారం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here