Mukhachitram Review : ‘ముఖచిత్రం’లో లాయర్​గా విశ్వక్​సేన్​ కేసు గెలిచాడా..?

- Advertisement -

Mukhachitram Review : ఇప్పుడు ట్రెండ్ అంతా థ్రిల్లర్ సినిమాలదే. థియేటర్​లో మూవీ చూడాలంటే.. బీభత్సమైన బీజీఎం.. ఉత్కంఠ భరితమైన కంటెంట్​.. కావాల్సినంత థ్రిల్లింగ్ అంశాలు ఉంటేనే ఆడియెన్స్ థియేటర్ల వరకు వెళ్తున్నారు. అందుకే డైరెక్టర్లు కూడా థ్రిల్లర్ జానర్​లో సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఫేస్ మార్ఫింగ్/ ఫేస్ ప్లాస్టిక్ సర్జరీ అనే కాన్సెప్ట్​తో తెరకెక్కించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ముఖచిత్రం.

సినిమా ట్రైలర్​ చూస్తుంటే ఉత్కంఠ భరితంగా అనిపించింది. ఇవాళ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ ఏంటంటే.. యంగ్ యాక్టర్ విశ్వక్ సేన్​ లాయర్​గా నటించడం. మరి విశ్వక్​సేన్ తను వాదించిన కేసు గెలిచాడా..? ముఖచిత్రం మూవీ ప్రేక్షకులు కోరుకున్న థ్రిల్లింగ్ కలిగించిందా.. తెలుసుకుందామా..?

Mukhachitram Review
Mukhachitram Review

సినిమా : ముఖచిత్రం

- Advertisement -

నటీనటులు – వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్, విశ్వక్ సేన్ తదితరులు

కథ స్క్రీన్ ప్లే

మాటలు: సందీప్ రాజ్

దర్శకత్వం: గంగాధర్

నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల

సంగీతం : కాల భైరవ

ఎడిటింగ్: పవన్ కళ్యాణ్

సమర్పణ: ఎస్ కేఎన్

రిలీజ్ డేట్: 2022-12-09

స్టోరీ ఏంటంటే..? రాజ్‌ కుమార్‌(వికాస్‌ వశిష్ణ) పాపులర్‌ ప్లాస్టిక్‌ సర్జన్‌.. పల్లెటూరి పిల్ల మహతి(ప్రియా వడ్లమాని) ఇష్టపడతాడు. పెళ్లి చూపుల్లో ఆమెను చూసి ఇష్టపడతాడు. అంతే ఆమెను ఎలాగోలా ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకుంటాడు. వారి వైవాహిక జీవితం హ్యాపీగా జాలీగా సాగిపోతూ ఉంటుంది. మరోవైపు స్కూల్‌ డేస్‌ నుంచి తన స్నేహితురాలు మాయా(ఆయేషా ఖాన్‌) రాజ్​ను ప్రేమిస్తుంది. ఆ విషయం రాజ్‌ పెళ్లి సెట్‌ అయ్యిందనప్పుడు చెబుతుంది. కానీ ప్రయోజనం ఉండదు. ఇక తను గర్భవతి అనే విషయాన్ని రాజ్‌కుమార్‌కి చెప్పాలనుకుంటుంది మహతి.

సరిగ్గా అదే సమయంలో మాయ రోడ్డు ప్రమాదానికి గురైందని ఫోన్‌ రావడంతో ఆ విషయం చెప్పలేకపోతుంది. రోడ్డు ప్రమాదంలో మాయ ముఖం మొత్తం డ్యామేజ్‌ అవుతుంది. ఆమెది రేర్‌ బ్లడ్‌ గ్రూప్‌. మహతి బ్లడ్‌ మ్యాచ్‌ కావడంతో మాయకి రక్తదానం చేస్తుంది. ఆ నెక్ట్స్ డే అనుకోకుండా ఇంట్లో పై ఫ్లోర్‌ నుంచి జారి కిందపడిపోయిన మహతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూస్తుంది. మాయకి మహతి ఫేస్‌ మార్ఫింగ్‌ చేసి మహతి చనిపోలేదని వాళ్ల ఫ్యామిలీని నమ్మిస్తాడు రాజ్‌.

మాయనే మహతిగా ఊహించుకుని ఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఓ రోజు హాస్పిటల్‌ వర్క్ మీద రాజ్‌ వేరే స్టేట్‌కి వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో మహతిగా ఉన్న మాయకి ఇంట్లో మహతి ఫోన్‌ దొరుకుతుంది. అందులో వాట్సాప్‌ చెక్‌ చేయగా, రాజ్‌ గురించి దిగ్భ్రాంతికి గురి చేసే విషయం తెలుస్తుంది. ఆ ఫోన్‌లో ఏముంది? రాజ్‌పై మాయ ఎందుకు కేసు పెట్టింది? మహతి చావుకి కారణం ఎవరు? ఆ కేసుని లాయర్‌ విశ్వక్‌ సేన్‌ వాదించడానికి కారణమేంటి? ఇంతకి విశ్వా ఎవరు? అనేది మిగిలిన కథ.

 ఎలా ఉందంటే.. : ప్లాస్టిక్ సర్జరీ పాయింట్‌ను ఎమోషనల్ స్టోరీగా డెవలప్ చేయడంలో దర్శకుడు గంగాధర్ సక్సెస్ అయ్యాడు. కథలోకి వెళ్లడానికి కాస్త సమయం తీసుకోవడంతో సాగదీతలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్​లో కథను డిటేయిల్‌గా చెప్పడానికి ట్రే చేయడంతో కాస్త బోరింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు ఓ ఎమోషనల్ పాయింట్​తో కథను మలుపు తిప్పడం డైరెక్టర్ టాలెంట్​కు అద్దం పట్టింది.

సెకండ్ హాఫ్​లో ట్విస్ట్ ప్రేక్షకులను సీట్ అంచున నిలబెడుతుంది. గుండెను అదిమి పెట్టుకుని చూసేలా చేస్తుంది. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ కాస్త ఫేస్‌ మార్ఫింగ్‌కి వెళ్లడం, థ్రిల్లర్‌గా మారడం, అక్కడి నుంచి సెక్సువల్‌ అబ్యూజింగ్‌ అంశాలతో ముడిపెట్టడం అంతగా కన్విన్సింగ్‌గా అనిపించదు. ఎంచుకున్న పాయింట్‌ బాగుంది. అందులో చర్చించిన ఫ్యామిలీ అంశాలు ఆకట్టుకుంటాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య సెక్సువల్‌ అబ్యూజింగ్‌ అనే పాయింట్‌ని చర్చించిన తీరు బాగుంది.

అయితే దాన్ని ఎవరూ ఇప్పటి వరకు పాయింట్‌ ఔట్‌ చేయలేదు. ఇందులో ఆ విషయాన్ని బట్టలిప్పదీసి బయటపెట్టారు మేకర్స్. కథ అలాగే ఎమోషనల్ ట్రాక్​లో ఎండ్ అవుతుందని భావిస్తున్న సమయంలో విశ్వక్ సేన్ ఎంట్రీతో సీన్ మారిపోతుంది. కోర్డు డ్రామా కాస్త వీక్ అవ్వడంతో స్టోరీలో అప్పటిదాకా మెయింటైన్ చేసిన ఇంటెన్సిటీ తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. అప్పటి వరకు ఒక జానర్​లో సాగిన స్టోరీ కోర్డు డ్రామాతో మరో జానర్​లోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.

యాక్టింగ్ ఎలా చేశారంటే.. : మహతి పాత్రలో ప్రియ వడ్లమాని తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఎవరూ ఊహించని పాత్రలో రకరకాల వేరియేషన్ ఉన్న రోల్‌లో అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. రాజ్ కుమార్ పాత్రలో వికాస్ వశిష్ట పోటీ పడి నటించాడు. నెగిటివ్ షేడ్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. చైతన్య రావ్ తనదైన శైలిలో కామెడీని పండించాడు. మాయగా ఆయేషా ఖాన్ ఫర్వాలేదనిపిస్తుంది. ఇక లాయర్​గా విశ్వక్​సేన్ తనలోని మరో యాంగిల్​ని బయటపెట్టాడు. థ్రిల్లర్ జానర్​కు బీజీఎం ఇంపార్టెంట్. ఈ విషయంలో కాలభైరవ 100 శాతం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సందీప్‌ రాజ్‌ ఎంచుకున్న కథ బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు. కానీ కథని తీసుకెళ్లిన తీరు కొంత కన్ఫ్యూజ్‌ చేస్తుంది. అదే కన్‌ఫ్యూజన్‌ దర్శకుడిలోనూ కనిపించింది.

ఇది రెగ్యూలర్‌ థ్రిల్లర్‌ చిత్రంగా నిలిచిపోయింది. ఈ మూవీలో చర్చించిన ఫ్యామిలీ అంశాల విషయంలో అభినందించాల్సిందే. దర్శకుడిగా గంగాధర్‌ మెప్పించాడు. వినోదానికి స్కోప్‌ ఉన్నా, ఆ విషయంలో పెద్దగా ఫోకస్‌ చేయకపోవడం మైనస్‌. శ్రీనివాస్‌ బెజుగం కెమెరా వర్క్ బాగుంది. పాకెట్‌ మనీ పిక్చర్స్ నిర్మాణానికి వంక పెట్టడానికి లేదు.

కన్​క్లూజన్​ : ‘ముఖచిత్రం’ మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

రేటింగ్ : 2.75/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here