Multi Starrer Movies 2022 : 2022లో అదరగొట్టిన టాలీవుడ్ మల్టీస్టారర్ సినిమాలు ఇవే



Multi Starrer Movies 2022 : 2022 ఏడాది గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఎంటర్‌టైన్మెంట్.. ఎంటర్‌టైన్మెంట్.. ఎంటర్‌టైన్మెంట్. ఈ ఇయర్ బాక్సాఫీస్ గళగళలాడింది. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు క్రియేట్ ఇయ్యాయి. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ఓటీటీలు, థియేటర్లు సందడి చేశాయి. ఇక డబుల్ డోస్ ఇస్తామంటూ కొందరు హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేసి ఎన్నడూ ఊహించని కాంబినేషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేశారు.

నాగార్జున-నాగ చైతన్య, చిరంజీవి- రామ్ చరణ్ వంటి మల్టీస్టారర్‌లు నిరాశపరిచినా.. ఒకే తెరపై ఒకే సీన్‌లో ఈ తండ్రీ కొడుకులను చూడాలన్న ఫ్యాన్స్ కల మాత్రం నెరవేరింది. అలా ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి ఈ ఏడాది తెలుగు తెరపై తెగ సందడి చేశారు. 2022లో థియేటర్స్‌లో సందడిచేసి ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించుకున్న మల్టీ స్టారర్ సినిమాలపై ఓ లుక్కేద్దామా..?

RRR

RRR
RRR

జక్కన్న చేతిలో నుంచి జాలువారిన మరో కళాఖండం RRR. బాహుబలితో ప్రపంచ సినిమా చరిత్రలో టాలీవుడ్‌కు ప్రత్యేక పేజీని లిఖించిన రాజమౌళి.. RRRలో తెలుగు సినిమా సత్తా ఏంటో ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్‌ స్థాయిలో నిరూపించాడు. కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇద్దరు పవర్‌ఫుల్ స్టార్లు కలిసి నటించిన ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాక ఇంకా అవార్డులు వస్తూనే ఉన్నాయి.

భీమ్లా నాయక్

Bheemla nayak
Bheemla nayak

పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ పేరు చాలు ఫ్యాన్స్ గుండెల్లో వేయి వీణలు ఒకేసారి మోగినట్టు ఉంటుంది. ఆయన తెరపై కనబడితే చాలు.. పక్కన ఎంతటి ఘనమైన నటుడున్నా.. ఎంత అందమైన హీరోయిన్ ఉన్నా.. బ్యాక్‌గ్రౌండ్‌లో భీకరమైన బీజీఎం ఉన్నా లేకపోయినా.. అవేం కనిపించవు. కేవలం పవర్ స్టార్ తప్ప. ఆయన ఉంటే చాలు కథ ఉన్నా లేకపోయినా.. కంటెంట్ ఉన్నా లేకపోయినా సినిమా హిట్ అవుతుంది. అంతటి క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ ఓ పాన్ ఇండియా స్టార్‌తో జతకడితే.. ఆ ఇద్దరూ కలిసి ఓ సినిమా తీస్తే.. ఆ సినిమా భీమ్లానాయక్ అయితే.. రికార్డులు తిరగరాయాల్సిందే. రీమేక్ అయినా హిస్టరీ క్రియేట్ చేయాల్సిందే. పవన్ కల్యాణ్-రానా మల్టీస్టారర్‌గా మలయాళ సూపర్‌ హిట్ ఫిల్మ్‌ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన భీమ్లానాయక్ రికార్డుల పంట పండించింది.

F3

F3
F3

ఫన్, ఫ్రస్ట్రేషన్‌.. విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిస్తే చాలు వాళ్లలో ఫ్రస్ట్రేషన్ అంతా ఫన్‌గా మారిపోతుంది. ఈ ఇద్దరు తమలోని ఫ్రస్ట్రేషన్‌ని చూపిస్తూ మనకు ఫన్‌ అందించిన సినిమా F2. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో దీనికి సీక్వెల్‌గా మరింత ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సినిమానే F3. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరైన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో మరోసారి వెంకీ, వరుణ్‌ల మల్టీస్టారర్‌ మ్యాజిక్‌ వర్కవుట్ అయింది. మంచి టాక్ సంపాదించుకుంది.

గాడ్ ఫాదర్

God Father
God Father

టాలీవుడ్‌ సినిమా మల్టీస్టారర్లలో టాలీవుడ్ హీరోలే నటించారు. కానీ ఫస్ట్ టైం టాలీవుడ్ సినిమాలో తెలుగు హీరోతో కలిసి ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ మల్టీస్టారర్ చేశాడు. అదే గాడ్‌ఫాదర్ మూవీ. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన మలాయళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లూసీఫర్‌కు రీమేక్‌గా ఈ చిత్రం వచ్చింది. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాలో విలన్‌గా సత్య దేవ్ అలరించగా.. చిరంజీవికి సపోర్ట్‌గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ పోషించారు. మోహన్ రాజా దర్శకత్వం వహించి ఈ సినిమా టాక్ పరంగా సక్సెస్ సాధించినప్పటికీ వసూళ్ల పరంగా అంతగా రాబట్టలేకపోయింది.

ఓరి దేవుడా

Ori Devuda

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా పొట్టి నూడుల్స్ అదేనండి.. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా అలరించిన చిత్రం ఓరి దేవుడా. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం ఓ మై కడవులే మూవీకి రీమెక్ వెర్షన్. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి టాక్ మాత్రం పాజిటివ్‌గానే వచ్చింది.

బంగార్రాజు

Bangarraju
Bangarraju

2022 క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలోనే సందడి చేసిన సినిమా బంగార్రాజు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, ఆయన కుమారుడు నాగ చైతన్య కలిసి నటించిన ఈ చిత్రం సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా తెరకెక్కింది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తోనే హిట్టు కొట్టింది. ఇందులో నాగార్జున రెండు పాత్రల్లో నటించారు. ఇక హీరోయిన్స్‌గా రమ్యకృష్ణ, కృతి శెట్టి అలరించారు.

ఆచార్య

Aacharya

తండ్రి కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో సత్యదేవ్ కూడా ఓ పాత్ర పోషించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా సందడి చేసింది. కొరటాల శివ వంటి డైరెక్టర్.. అందులోనూ మొదటిసారిగా చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి ఫుల్ లెన్త్ సినిమా చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా ఫలితం మాత్రం ఈ ముగ్గురి కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

Tags: