Palak Tiwari : బీ టౌన్ లో మరో ప్రేమ జంట.. యంగ్ బ్యూటీతో ప్రేమలో స్టార్ కిడ్

- Advertisement -

Palak Tiwari : బాలీవుడ్ లో డేటింగ్ చాలా కామన్. ఎవరు ఎప్పుడు ఎలా ఎవరితో డేటింగ్ చేస్తారో.. ఎందుకు బ్రేకప్ అవుతారో తెలియదు. ఇవాళ కనిపించిన జంట రేపు కనుమరుగైపోతుంది. రోజుకో కొత్త జంట పుట్టుకొస్తుంది. ఇక స్టార్ కిడ్స్ ప్రేమ కథలకైతే కొదువే ఉండదు. ఇప్పటికే అరడజనుకు పైగా స్టార్ కిడ్స్ డేటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆ లిస్టులో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ చేరాడు. ఈ పటౌడీ వారసుడు ఓ టీవీ నటి కుమార్తెతో ప్రేమాయణం నడుపుతున్నట్లు టాక్. 

Palak Tiwari and Ibrahim Ali Khan

పటౌడీ వారసుడిగా ఇబ్రహీం త్వరలోనే బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే తన కిల్లర్ లుక్స్, యాటిట్యూడ్ తో ఈ స్టార్ కిడ్ చాలా పాపులర్ అయ్యాడు. అయితే ఇంకా ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందే ఇబ్రహీం తన లవ్ లైఫ్ తో హెడ్ లైన్స్ కు ఎక్కాడు. టెలివిజన్ నటి శ్వేతా తివారు కుమార్తె పాలక్ తివారీతో ఇబ్రహీం ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇబ్రహీం-పాలక్ డేటింగ్ చేస్తున్నట్లు బీ టౌన్ గుసగుసలు వినిపిస్తున్నాయి. యువ నటి పాలక్ తన ఇన్ స్టాలో ఇబ్రహీంతో కలిసి ఉన్న ఫోటోలను చాలా సార్లు షేర్ చేసింది. అయితే తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని తెలిపింది.

Palak Tiwari and Ibrahim Ali Khan

మరోసారి ఈ జంట ఆదివారం నాడు ముంబయిలో జరిగిన రాక్ కన్సర్ట్ లో కనిపించారు. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జంట గురించి డేటింగ్ పుకార్లు వేడి పెంచుతున్నాయి. దీనిపై సైఫ్ ఖాన్ వారసుడు స్పందించాల్సి ఉంది. సైఫ్ ప్రస్తుతం బాలీవుడ్ సహా దక్షిణాదినా వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్ 3డిలో ప్రభాస్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. సైఫ్ నటవారసుడు ఇబ్రహీం తెరంగేట్రంపై సాధ్యమైనంత తొందర్లోనే అధికారిక ప్రకటన రానుంది.

- Advertisement -

ఇబ్రహీం అలీ ఖాన్ ను బీ టౌన్ లో కరణ్ జోహర్ పరిచయం చేయనున్నారు. ఇబ్రహీం అలీఖాన్ తొలి చిత్రం కోసం కరణ్ జోహార్ యాజమాన్యంలోని ధర్మ ప్రొడక్షన్స్ ఇప్పటికే ప్రీప్రొడక్షన్ కాస్టింగ్ ఎంపికలను ప్రారంభించింది. ఇబ్రహీం అలీఖాన్  తొలి సినిమాకి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఓ సమాచారం మేరకు ఈ చిత్రంతో  12 ఏళ్ల తర్వాత కాజోల్ మళ్లీ తన స్నేహితుడు కం నిర్మాత అయిన కరణ్ తో కలిసి పని చేయనుంది.

 యువహీరో అరంగేట్ర చిత్రంలో కాజోల్ పాత్ర ఏంటన్నది తెలియాల్సి ఉంది. కొత్త హీరో ఇబ్రహీం అలీ ఖాన్ నటశిక్షణ ఇప్పటికే పూర్తయింది. డ్యాన్సులు ఫైట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తండ్రి లెగసీని ముందుకు నడిపించేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో కాజోల్ ఈ చిత్రంలో భావోద్వేగంతో కూడుకున్న బలమైన పాత్రను పోషిస్తుంది. ఇబ్రహీం అలీ ఖాన్ తో మ్యాగ్జిమమ్ స్క్రీన్ సమయాన్ని షేర్ చేసుకోనుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here