Special Songs in Tollywood : 2022లో అదరగొట్టిన ది బెస్ట్ ఐటెం సాంగ్స్ ఇవే

- Advertisement -

Special Songs in Tollywood : సినిమా అంటేనే ఎంటర్​టైన్మెంట్.. హీరో ఎంట్రీ సాంగ్.. హీరోయిన్​తో రొమాంటిక్ సాంగ్.. ఓ మాస్ మసాలా సాంగ్.. ఇలా ఎన్ని ఉన్నా.. Special Songs in Tollywood ప్రత్యేకతే వేరు. ఇక ఆ స్పెషల్ సాంగ్ కాస్త క్యాచీగా.. మాస్ బీట్​తో ఉంటే ఆ పాటొకొచ్చే క్రేజే వేరు. ఇంకా ఆ సాంగ్​లో ఏ స్టార్ హీరోయినో స్టెప్పులు వేస్తే వచ్చే మజాయే కుచ్ ఔర్ హై.

మాస్ ప్రేక్షకుల్ని ఊరిస్తూ థియేటర్లకు రప్పించాలంటే.. దర్శక నిర్మాతలు ఫస్ట్ చూసేది స్పెషల్‌ సాంగ్‌ వైపే. ఎప్పట్లాగే ఈ ఏడాదీ తెలుగులో ఐటెమ్‌ సాంగ్స్ హోరెత్తాయి. కొన్ని పాటలు మాత్రం ఆయా సినిమాలకు కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టాయి. మరి ఈ ఏడాది ప్రేక్షకులను అలరించిన ఐటెమ్ సాంగ్స్​పై ఓ లుక్కేద్దామా..?

నాగార్జున అంటేనే రొమాన్స్ గుర్తొస్తుంది మనకు. మరి ఈ మన్మథుడి సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే మామూలుగా ఉంటుందా. అయితే ఈ ఏడాదిలో ‘బంగార్రాజు’ సినిమాలో ‘‘వాసివాడీ తస్సాదియ్యా..’’ అంటూ నాగ్‌తో పాటు ఆయన తనయుడు చైతన్యతో కలిసి అదిరిపోయేలా మాస్‌ స్టెప్పులేసింది యువ కథానాయిక ఫరియా అబ్దుల్లా. ఈ పాటకు దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ స్వయంగా సాహిత్యమందించగా.. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. దీనికి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.

- Advertisement -

‘‘కల్లోలం.. కల్లోలం.. ఊరూవాడా కల్లోలం’’ అంటూ ‘ఆచార్య’లోని స్పెషల్ సాంగ్​తో కుర్రాళ్ల గుండెల్లో కల్లోలం రేపింది రెజీనా. చిరంజీవి – రామ్‌చరణ్‌ కలిసి నటించిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు. ఈ సినిమా కోసమే చిరులోని మాస్‌ ఎనర్జీని ఆవిష్కరించేలా భాస్కరభట్లతో కలిసి ‘‘కల్లోలం..’’ పాటను ప్రత్యేకంగా రాయించారు దర్శకుడు కొరటాల. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు బోల్తా కొట్టినప్పటికీ.. ఈ స్పెషల్ సాంగ్​కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది.

‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో శ్రీకాకుళం సారంగిగా ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపింది నటి అన్వేషి జైన్‌. రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శరత్‌ మండవ తెరకెక్కించారు. ఈ సినిమాలోని ‘‘నా పేరు సీసా..’’ అనే ప్రత్యేక గీతంలో రవితేజతో కలిసి ఆడిపాడింది అన్వేషి. ఈ పాటకు సామ్‌ సిఎస్‌ స్వరాలు సమకూర్చగా.. శ్రేయా ఘోషల్‌ ఆలపించింది.

‘బింబిసార’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన మరో ప్రత్యేక అందం వరీనా హుస్సేన్‌. ఇందులో ‘‘గుళేబకావళి పువ్వులాంటి యవ్వనం..’’ పాటలో కల్యాణ్‌ రామ్‌తో కాలుకదిపిన ఈ అందం.. ఆ వెంటనే ‘గాడ్‌ఫాదర్‌’లో ఆడిపాడే అవకాశం అందుకుంది. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సల్మాన్‌ ఖాన్‌ అతిథి పాత్రలో మెరిశారు. ఈ చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి చేసే ఓ ఫైట్‌ సీక్వెన్స్‌లో ‘‘బ్లాస్ట్‌ బేబీ’’ అంటూ ప్రత్యేక పాటతో ప్రేక్షకుల్ని హుషారెత్తించింది వరీనా.

‘మాచర్ల నియోజకవర్గం’లోని ‘‘రా రా రెడ్డి.. ఐయామ్‌ రెడీ’’ పాటలో అందాలు ఆరబోసింది నటి అంజలి. నితిన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. దీనికి ప్రేక్షకుల నుంచి చేదు ఫలితం దక్కినప్పటికీ.. ఇందులోని ‘‘రా రా రెడ్డి’’ పాటకు మంచి ఆదరణే దక్కింది. ఈ పాటలోని ఓ చిన్న బిట్‌లో ‘జయం’లోని ‘‘రాను రానంటూనే చిన్నదో’’ గీతాన్ని రీమిక్స్‌ చేసి వినిపించారు సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్‌. దానికి నితిన్‌ – అంజలి కలిసి వేసిన స్టెప్పులకు సినీప్రియుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. ఇక ఇటీవల విడుదలైన మంచు విష్ణు ‘జిన్నా’లోని ‘‘జారు మిఠాయా’’ పాటకూ నెట్టింట మంచి ఆదరణ లభించింది.

‘‘జిగేలు రాణి’’ అంటూ గతంలో ‘రంగస్థలం’ చిత్రంలోని ప్రత్యేక గీతంతో కుర్రకారును ఉర్రూతలూగించింది నటి పూజా హెగ్డే. ఆమె ఈ ఏడాది ‘ఎఫ్‌3’ కోసం మరోసారి ఐటెమ్‌ బాంబుగా మారిపోయింది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రమిది. ‘ఎఫ్‌2’కు కొనసాగింపుగా రూపొందించారు.

ఈ చిత్రం కోసమే ‘‘అధ్యక్షా.. లైఫ్‌ అంటే మినిమం ఇట్లా ఉండాలా’’ అనే ఓ ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేశారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌. ఈ పాటలోనే వెంకీ – వరుణ్‌లతో కలిసి హుషారెత్తించేలా స్టెప్పులేసింది పూజా. కాసర్ల శ్యామ్‌ సాహిత్యంతో రూపుదిద్దుకున్న ఈ పాట.. సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది.

అటు ఉత్తరాదిలోనూ.. ఇటు దక్షిణాదిలోనూ పలు ఐటెమ్‌ గీతాల్లో నర్తించి మురిపించిన ముద్దుగుమ్మ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. ఆమె ఈ ఏడాది ‘విక్రాంత్‌ రోణ’లోని ‘‘రా రా రక్కమ్మ’’ పాటతో మాస్‌ పల్స్‌ రేట్‌ ఒక్కసారిగా పెంచేసింది. కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. ఈ పాటకు మాత్రం దేశవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ లభించింది. ఈ గీతానికి తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. మంగ్లీ ఆకట్టుకునేలా ఆలపించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here