Prabhas : రాజా డీలక్స్ ఫోటో లీక్..! ప్రభాస్ ఏంటి ఇలా ఉన్నాడు..

prabhas


Prabhas : ఒకటికి మూడు ప్రాజెక్టులను సెట్ మీద పెట్టిన ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోగా రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆది పురుష్ తో కలిపి నాలుగు చిత్రాలు సెట్ పై వుంచాడు. ఇక ఈ చిత్రం జూన్ నెలలో విడుదల కానుంది. ఇకపోతే ప్రాజెక్ట్ కే , సలార్, రాజా డీలక్స్ వంటి చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉండగా కనీసం అభిమానులు కూడా ఆది పురుష్ మూవీ కోసం ఎదురుచూడడం లేదు.. టీజర్ చూసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారు.. దానికి తోడు వివాదాలు ప్రాజెక్టు మీద హైప్ పోయేలా చేశాయి.

Prabhas Raja Deluxe
Prabhas Raja Deluxe

ఇకపోతే ఆది పురుష్ రూపంలో ప్రభాస్ మరో ఫ్లాప్ చూడబోతున్నాడని పలువురు వాదన ఎందుకంటే తాజాగా రాజా డీలక్స్ మీద కూడా అంచనాలు లేకుండా పోతున్నాయి.అసలు విషయంలోకి వెళ్తే నిజానికి ఈ ప్రాజెక్టు వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు తెరకెక్కించిన సుజీత్, రాధాకృష్ణులకు అనుభవం లేదు. అందుకే ప్రభాస్ వంటి టాప్ స్టార్ ని సరిగా ప్రజెంట్ చేయలేకపోయారని ప్రచారం జరిగింది . ఈ క్రమంలోనే దర్శకుడు మారుతూ కూడా ఆఫర్ ఇవ్వడం అవసరమా అని అందరూ పెదవి విరిచారు ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఫోటో బయటకు రాగా ఇది మరింత అద్వానంగా ఉందని చెప్పాలి.

రాజా డీలక్స్ మూవీకి సంబంధించి ఒక పిక్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది . ఈ ఫోటోలో ప్రభాస్ లుక్ కొంచెం భిన్నంగా ఉంది. బాగా గడ్డం జుట్టు పెంచుకొని ఉన్నాడు ప్రభాస్ . పక్కన రిద్దీ కుమార్ ఉంది అంత పెద్ద స్టార్ పక్కన ఇంత చిన్న హీరోయిన్ ఏంటి అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహన్ మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నారట. మొత్తానికైతే ఈ ఒక్క ఫోటో ఈ సినిమాపై కూడా అంచనాలను నాశనం చేసిందని చెప్పాలి.