ఆ 3 ఏళ్ళు రాఖీ భాయ్ ఏమి చేసాడు..? KGF 3 గురించి సెన్సషనల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్KGF 3 : ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన KGF చాప్టర్ 2 విడుదలై నేటితో సరిగ్గా ఏడాది కావొస్తుంది. విడుదలైన అన్నీ బాషలలో బాహుబలి సిరీస్ తర్వాత గ్రాండ్ సక్సెస్ అయినా సిరీస్ ఇదే.ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా సృష్టించిన వసూళ్ల సునామి ని ఎవ్వరు తట్టుకోలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం, అప్పట్లో #RRR రికార్డ్స్ ని సైతం బద్దలు కొట్టింది.

KGF 3
KGF 3

హీరోయిజమ్ కి ఈ సిరీస్ ద్వారా సరికొత్త నిర్వచనం తెలిపిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అతి త్వరలోనే ఈ సిరీస్ ని కొనసాగిస్తూ చాప్టర్ 3 కూడా తియ్యబోతున్నాడు.KGF చాప్టర్ 2 క్లైమాక్స్ లోనే పార్ట్ 3 ఉంటుంది అని ఒక హింట్ ఇచ్చాడు డైరెక్టర్.కానీ సీరియస్ గా ఆ సినిమాని చేస్తాడా లేదా అనే విషయం ఎవరికీ క్లారిటీ గా చెప్పలేదు.

Actor Yash

అయితే ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఒక వీడియో ని విడుదల చేసారు.రాఖీ భాయ్ 1978 నుండి 1981 వరకు ఇండియా ని వదిలి విదేశాలకు వెళ్తాడు.అక్కడ కూడా ఆయన క్రైమ్ వరల్డ్ ని రూల్ చేస్తాడు.ఈ అంశం పైన ఈ చిత్రం ఉంటుందట.రాఖీ భాయ్ విదేశాల్లో ఆ మూడు సంవత్సరాలు ఏమి చేసాడు..?

Actor Yash KGF Movie

రాఖీ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట పూర్తిగా నెరవేరిందా..? ఇలాంటి అంశాలను కవర్ చేస్తూ చాప్టర్ 3 ఉంటుందని ఈ సందర్భంగా వీడియో ద్వారా తెలియచేసాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న ‘సలార్’ మరియు త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో చెయ్యబోతున్న సినిమా, ఈ రెండు చిత్రాలు పూర్తి అయితేనే KGF చాప్టర్ 3 ఉంటుందట.