Actress Prema : సౌందర్య డెడ్ బాడీని దాన్ని చూసి గుర్తించారు.. ప్రేమ చెప్పిందంతా నిజమా?

- Advertisement -

Actress Prema : హీరోయిన్ సౌందర్య గురించి అందరికి తెలిసిందే.. సావిత్రి, విజయశాంతిల తర్వాత అంతటి స్టార్డం తెచ్చుకున్న హీరోయిన్ గా సౌందర్యను చెప్పవచ్చు.. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. స్టార్ హీరోల సరసన జోడి కట్టింది..చిత్ర పరిశ్రమలో ఆమె పదేళ్లు ఉన్నా కూడా జనాలకు గుర్తుండి పోయేలా సినిమాలు చేసింది.. ఆ పాత్రలో ఒదిగి పోయింది..కన్నడ అమ్మాయి అయిన సౌందర్యను తెలుగు పరిశ్రమ అక్కున చేర్చుకుంది.

ఇతర భాషల్లో చిత్రాలు చేసినప్పటికీ తెలుగు హీరోయిన్ గా స్థిరపడ్డారు. అత్యధికంగా టాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు.. అందుకే ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా సౌందర్య మరణం పై హీరోయిన్ ప్రేమ సంచలన విషయాలను బయట పెట్టారు.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయంసంగా మారాయి..

Actress Prema
Actress Prema

ఒక సినిమాలో సౌందర్య నటిస్తున్నారని అంటే దాని పై అంచనాలు కూడా ఎక్కువనే చెప్పాలి.. అంత డిమాండ్ ఉండేది..అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అంతే త్వరగా అందరిని విడిచి వెళ్ళిపోయింది..ఆమె కీర్తిని చూసి కన్ను కుట్టిన భగవంతుడు జీవితాన్ని అకాలంగా ముగించారు. 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో సౌందర్య మరణించారు. ఆమెతో పాటు తమ్ముడు కూడా అదే విమానంలో ఉన్నారు… ఆమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. అలాంటి నటి మళ్ళీ పుట్టదు.. ఆమె తల్లి దండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది..సౌందర్య తల్లిదండ్రులకు ఇద్దరు బిడ్డలు దూరమయ్యారు. సౌందర్య మరణంపై దిగ్భ్రాంతి కలిగించే విషయాలు నటి ప్రేమ వెల్లడించారు..

- Advertisement -
Soundharya

ప్రేమ ఇటీవల ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది.. సౌందర్యను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. సౌందర్య మరణ వార్త వేదనకు గురి చేసింది. చివరి చూపు చూసేందుకు ఆమె నివాసానికి వెళ్ళాను. సౌందర్య, ఆమె తమ్ముడు డెడ్ బాడీస్ బాక్సులలో పెట్టి ఉంచారు. సౌందర్య బాడీకి తల లేదు.

కనీసం చివరి చూపు కూడా మాకు మిగల్లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది..ఆమె ఎప్పుడూ అందం పై శ్రద్ద చూపించేది..లొకేషన్ లో షూటింగ్ లో షాట్స్ గ్యాప్ లో కూడా టచప్ చేసుకుంటూ లుక్ పర్ఫెక్ట్ గా ఉండాలని ఆశపడేవారు. అందం గురించి అంతగా ఆలోచించే సౌందర్యకు ప్రమాదంలో తల లేకుండా పోయింది..బ్రతికి ఉన్నప్పుడు ఏమి రావు.. కేవలం ఆమె చేతికి ఉన్న వాచ్ వల్ల మృతదేహన్ని సౌందర్యదని గుర్తించారు..మనుషులు బ్రతికి ఉన్నంత వరకే ఏవైనా అని ప్రేమ చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here