Prabhas బాలనటుడిగా నటించిన ఏకైక సినిమా అదేనా..!

- Advertisement -

Prabhas : టాలీవుడ్ నుండి నేటి తరం స్టార్ హీరోలలో మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్ ఎవరు అంటే ఏ హీరో అభిమాని అయినా అది ప్రభాస్ అని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే అది నిజం కాబట్టి, బాహుబలి సినిమాతో ఆయన మన తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసాడు. ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ ఏ రేంజ్ లో పెరిగిందో మన అందరికీ తెలిసిందే. ఆయన ఫ్లాప్ సినిమాలు మన స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ తో సమానం.

Prabhas
Prabhas

ఇక ఆయన రేంజ్ కి తగ్గ హిట్ కొడితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మొత్తం బ్లాస్ట్ అవ్వాల్సిందే. స్వర్గీయ కృష్ణం రాజు గారి అబ్బాయిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ప్రభాస్ ఈ రేంజ్ కి చేరుకుంటాడని బహుశా కృష్ణం రాజు కూడా ఊహించి ఉండదు. ఇది ఇలా ఉండగా ప్రభాస్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది.

Prabhas salaar movie

ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ మొట్టమొదటి సినిమా ఈశ్వర్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వాస్తవానికి ఆయన కెమెరా ని ఫేస్ చేసిన మొట్టమొదటి సినిమా ఇది కాదు. 1986 లో కృష్ణం రాజు హీరో గా నటించిన ఉగ్ర నరసింహం అనే చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఇందులో కృష్ణం రాజు చిన్నప్పటి రోల్ ని ముందుగా ప్రభాస్ తో చేయించారట. కానీ ఫైనల్ ఔట్పుట్ లో ఆ సన్నివేశాలు సరిగా రాలేదట, మళ్ళీ రీ షూటింగ్ చేయించడానికి చూస్తే ప్రభాస్ కి సెలవు దినాలు పూర్తి అయ్యి స్కూల్ ప్రారంభం అయ్యిందట.

- Advertisement -
Ugrarupam

ఇక ఆ చదువు డిస్టర్బ్ చేయించడం ఇష్టం లేక, కృష్ణంరాజు వేరే చైల్డ్ ఆర్టిస్టు తో మరోసారి రీ షూట్ చేయించారట. ఆ కత్తిరించిన ప్రభాస్ సన్నివేశాలకు సంబంధించిన రీల్స్ ఇప్పటికీ కృష్ణం రాజు ఆఫీసు లో భద్రంగా ఉన్నాయట. ఆ సన్నివేశాలను కనీసం యూట్యూబ్ లో అయినా పెడితే ఫ్యాన్స్ సంతోషిస్తారు. మరి ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ అభిమానుల కోరిక మేరకు ఆ ప్రయత్నం చేస్తాడో లేదో చూడాలి.

Prabhas Childhood photos
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here