Payal Rajput : చీరకట్టులో పాయల్ రాజ్‌పుత్.. బోల్డ్ బ్యూటీ కొంటెచూపునకు కుర్రాళ్లు ఫిదా



RX100 సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్. బుల్లెట్ లాంటి స్పీడ్‌తో.. కైపెక్కించే తన అందంతో కుర్రాళ్ల హార్ట్‌బీట్ పెంచేసింది. ఆ తర్వాత RDXలవ్ అంటూ యువకుల గుండెల్లో గ్లామర్ బాంబ్ పేల్చేసింది. ఈ సినిమాలతో బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న Payal Rajput .. వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

Payal Rajput
Payal Rajput

సినిమా ఆఫర్లు వచ్చినా.. ఈ బ్యూటీకి సరైన హిట్ మాత్రం రావడం లేదు. RX100 తప్ప పాయల్ ఖాతాలో సరైన హిట్ మూవీ లేదు. ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయి పాత్రలో పాయల్ నటనకు విమర్శకులు కూడా జై కొట్టారు. ఇక ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్‌కు బోల్డ్ సీన్స్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు.

Payal Rajput Photos

సినిమాల్లోనే కాదు పాయల్ సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇక ఈ భామ వెండితెరపైనే కాదు.. నెట్టింటా గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ బోల్డ్ బ్యూటీ గ్లామర్ ట్రీట్‌కు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. నెట్టింట పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత చూసి అదరహో అంటుంటారు.





Payal Rajput saree photos

ఎప్పుడూ ట్రెండీ, మోడర్న్ వేర్‌లో కనిపించే పాయల్ తాజాగా చీరకట్టులో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసింది. సంప్రదాయ దుస్తుల్లోనూ పాయల్ తనలోని గ్లామర్‌ డోస్ ఏమాత్రం తగ్గించలేదు. స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో బ్లూ కలర్ శారీలో పాయల్ అందం మామూలుగా లేదు.

Payal Rajput latest saree photos

ఇక పాయల్ లేటెస్ట్ మూవీ మాయా పేటిక థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కింది. మొబైల్ వినియోగం ఎక్కువ కావడం వలన ఏర్పడే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నారు. పాయల్ నటించిన తీస్ మార్ ఖాన్ ఆగస్టులో విడుదలైంది. ఆది హీరోగా నటించిన ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. అలాగే మంచు విష్ణుతో జంటగా జిన్నా చిత్రం చేసింది. ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది.