‘ఆర్‌ఎక్స్100’ సినిమాతో యువతకు నిద్రపట్టకుండా చేసింది దిల్లీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, తీస్‌మార్ ఖాన్ మూవీస్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. Payal Rajput తన గ్లామర్‌తో ఓవైపు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూనే మరోవైపు తన నటనతో అన్ని వర్గాల ఆడియెన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది.
ఆర్‌ఎక్స్100, ఆర్డీఎక్స్ లవ్ సినిమాల్లో గ్లామర్ డోస్ పెంచి తన ఘాటైన అందాలు చూపించిన పాయల్ ఆ తర్వాత వెంకీమామలో డీసెంట్ పాత్రలో అలరించి ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా తనవైపు తిప్పుకుంది. ఇక మాస్ మహారాజ రవితేజ నటించిన డిస్కోరాజా సినిమాలో మూగ అమ్మాయి పాత్రలో నటించిన తనలో ఉన్న వర్సటాలిటీని బయటపెట్టింది. ఈ మూవీలో ఈ అమ్మడి యాక్టింగ్‌కి ఫిదా కానీ వారంటూ లేరు. ఆ తర్వాత మూవీస్ ఛాయిస్‌లో పాయల్ కాస్త తడబడింది. వరసు ప్లాఫ్‌లతో తనకున్న డిమాండ్‌ని అమాంతం తగ్గించేసుకుంది.
అయినా ఈ అమ్మడి కాన్ఫిడెన్స్ తగ్గలేదు. ఈ దిల్లీ బ్యూటీకి ఫ్యాన్స్ తగ్గలేదు. పాయల్ సినిమాలు చేసినా చేయకపోయినా.. అవి హిట్ అయినా కాకపోయినా ఆమె ఫ్యాన్స్ తన వెంటే ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. ఓవైపు పొట్టి పొట్టి దుస్తుల్లో హీట్ పుట్టిస్తూనే మరోవైపు సంప్రదాయ దుస్తుల్లో కుర్రకారు మతిపోగొతోంది. అందుకే ఈ భామ ఫ్యాన్స్‌లో అన్ని రకాల వారుంటారు.
అందమైన ఆమె చిరనవ్వు.. ఓర చూపు.. కుర్రకారును కవ్విస్తున్నాయి. హాట్ పోజులిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తూ ఈ బ్యూటీ యువకులు మనసు కొల్లగొట్టేస్తోంది. కైపెక్కించే బ్యూటీ ట్రీట్‌తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. రీసెంట్‌గా ఈ బోల్డ్ కమ్ హాట్ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.