Sandeep Kishan : నీకెంత కండలుంటే మాత్రం బట్టల్లేకుండా ఆ పనేంటి సందీప్.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్

- Advertisement -

Sandeep Kishan : టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులలో ఒకరైన సందీప్ కిషన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ ఒకప్పుడు సరైన స్క్రిప్ట్‌లు ఎంచుకోకపోవడంతో వరుస ఫ్లాప్‌లను చవిచూశాడు. కానీ ఊరు పేరు భైరవకోన హిట్‌తో సందీప్ కిషన్ దశ మారిపోయింది. ఈ సినిమా థియేటర్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. కథ, కథనం కొత్తగా ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయింది. యువ హీరోల్లో కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే వాళ్ళల్లో సందీప్ కిషన్ ఒకరు. త్వరలో ధనుష్ రాయన్ సినిమాతో పాటు మాయా వన్ సినిమా, ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయబోతున్నాడు.

సందీప్ కిషన్ త్వరలో అనిల్ సుంకర నిర్మాతగా .. భారీ బడ్జెట్ తో ఓ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. దాదాపుగా 25 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా సందీప్ కిషన్ షర్ట్ లేకుండా ఓ ఫోటో షేర్ చేసాడు. తన బాడీని చూపిస్తూ కింద పడుకొని దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మాయా వన్ సినిమా సెట్స్ నుంచి ఈ ఫోటో షేర్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్స్ సందీప్ కిషన్ బాడీ మీద క్రిస్ క్రాస్ గేమ్ ఆడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు నెటిజన్స్ సందీప్ బాడీ మీద క్రాస్ మార్క్స్, సర్కిల్స్ వేస్తూ గేమ్ ఆడారు.

- Advertisement -

ఓ మీమర్ సందీప్ బాడీపై గేమ్ ఆడిన ఫొటోస్ అన్ని స్క్రోల్ చేస్తూ వీడియో తీసి షేర్ చేశాడు. సందీప్ కూడా దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి చాలా ఫన్నీగా ఉంది అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి సందీప్ షర్ట్ లేకుండా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by ms memer (@ms._.memer_00)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here