Nara Brahmani : బాలయ్య కూతురు డేరింగ్ చూశారా.. మంచుకొండల్లో క్రేజీ అడ్వెంచర్..

- Advertisement -

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ డేర్ అండ్ డాషింగ్. బాలయ్య బాబు ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెరపైనా.. బుల్లితెరపైనా.. రీల్ లైఫ్‌లో.. రియల్ లైఫ్‌లో బాలయ్య ఏదైనా చేయాలనుకుంటే తెగించేసేస్తాడు. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎలాంటి సాహసమైనా చేయడానికి సై అంటాడు. దేనికీ వెనకాడడు. ఆరు పదుల వయసూలోనూ యువకుడిలా ఫైట్‌లు, డ్యాన్సులు చేసేస్తాడు. అచ్చం బాలయ్య లక్షణాలను పుణికిపుచ్చుకుంది ఆయన పెద్ద కూతురు Nara Brahmani నారా బ్రాహ్మణి.

ఓవైపు బిజినెస్ ఉమెన్‌గా మరోవైపు తల్లిగా, ఇల్లాలిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే.. ఇంకో వైపు తనకోసం సమయం కేటాయించుకుంటుంది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఆ సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తోంది నారా బ్రాహ్మణి. తండ్రి ధైర్యసాహసాలే ఈమెలో కూడా కనిపిస్తాయి మనకు.

ఆ ధైర్యంతో ఎముకలు కొరికే చలిలో బ్రాహ్మణి ఓ సాహస యాత్ర చేసింది. తాజాగా లద్దాఖ్‌లో బైక్‌ యాత్ర చేసింది. దీనికి సంబంధించిన విషయాలు, ఆ యాత్ర గురించి, అడ్వెంచర్ గురించి వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది.. అందులో ఆమె పర్వత సానువుల్లో మోటారు సైకిల్‌పై దూసుకెళ్తూ కనిపించింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

- Advertisement -
nara brahmani bike ride

యువ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఈఓలు సభ్యులుగా ఉన్న యంగ్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (వైపీఓ) ఇటీవల ‘ద లడక్‌ క్వెస్ట్‌’ పేరుతో నిర్వహించిన సాహస యాత్రలో బ్రాహ్మణి పాల్గొన్నట్టు సమాచారం. బ్రాహ్మణి పసుపురంగు బైక్‌ నడిపారు. యాత్రపై ‘జావా యెడ్జీ మోటార్‌ సైకిల్స్‌‘ పేరుతో ఒక లఘుచిత్రాన్ని వైపీఓ రూపొందించింది.

యాత్రలోని వారంతా తమ అనుభవాల్ని వివరించారు. “ఇప్పుడు ఉదయం 6.30 గంటలైంది. లద్దాఖ్‌ చాలా అద్భుతంగా, అందంగా ఉంది. ఇప్పుడు మేం థక్‌సే ఆరామానికి బయల్దేరుతున్నాం. మేం అసలు సిసలు ఆధ్యాత్మిక అనుభవం కోసం ఎదురు చూస్తున్నాం. అక్కడ ధ్యానం చేస్తాం” అని బ్రాహ్మణి అందులో పేర్కొన్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు, నందమూరి అభిమానులు.. బ్రాహ్మణి ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. బ్రాహ్మ‌ణి చాలా గ్రేట్ అని.. మా బాల‌య్య బాబు కూతురు సూప‌ర్ అంటూ వీడియోను సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here