PawanKalyan and Ram charan : మెగాస్టార్ బాటలో బాబాయ్-అబ్బాయ్.. ఒకే తరహా క్యారెక్టర్‌లో పవన్ కల్యాణ్, రామ్ చరణ్



PawanKalyan and Ram charan : టాలీవుడ్‌లో బాబాయ్ అబ్బాయ్ అనగానే గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ సినీ కెరీర్‌లో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే వీరి నెక్స్ట్ మూవీస్ గురించి ఓ క్రేజీ అప్డేట్ తెలిసింది. అదేంటంటే.. ఈ ఇద్దరు ఒకేసారి ఒకే తరహా పాత్రల్లో వేర్వేరు సినిమాల్లో కనిపించడానికి రెడీ అవుతున్నారట. ఇంతకీ ఈ మెగా హీరోలు చేస్తున్న క్రేజీ పాత్రలేంటంటే..?

PawanKalyan and Ram charan
PawanKalyan and Ram charan

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో చాలా సినిమాల్లో డ్యూయెల్ రోల్స్‌లో కనిపించారు. ముఖ్యంగా ఒకే సినిమాలో తండ్రీకొడుకు.. రెండు పాత్రల్లో తానే నటించి ప్రేక్షకులను అలరించారు. ‘బిల్లా రంగా,’ ‘బందిపోటు సింహం’, ‘‘రిక్షావోడు’, ‘స్నేహం కోసం’, ’అందరివాడు’ సినిమాల్లో చిరు.. తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ బాటలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ వెళ్తున్నారట. తమ రాబోయే సినిమాల్లో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారట.

megastar
megastar

తొలిసారి వయసు మళ్లిన తండ్రి పాత్రలో పవన్ కల్యాణ్ నటించనున్నాడా అంటే ఔననే అంటున్నాయి మెగా కాంపౌండ్ వర్గాలు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ ఫాదర్ క్యారెక్టర్‌తో పాటు.. కుమారుడిగా రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నట్టు సమాచారం. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్.. తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా తొందర్లోనే పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో ఒకటి లెక్చరర్ పాత్ర అయితే.. మరొకటి ఐబీ ఆఫీసర్ క్యారెక్టర్ అని తెలుస్తోంది.

మరోవైపు రామ్ చరణ్ కూడా శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రంలో తొలిసారి తండ్రీకొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ముందుగా ఈ పాత్ర కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్‌, మోహన్‌లాల్ లాంటి వేరే హీరోలను అనుకున్నారు. ఫైనల్‌గా రామ్ చరణ్‌తోనే డ్యూయెల్ రోల్ చేయించాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే తండ్రి పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తైయిందట. ఇందులో తండ్రి పాత్రకు జంటగా అంజలి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సర్కారోడు , సిటిజన్, అధికారి అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

PSPK

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. కెరీర్‌లో తొలిసారి తండ్రీకొడుకులుగా అది కూడా ఒకేసారి ద్విపాత్రాభినయం చేస్తుండంతో మెగాభిమానులు తెగ ఖుష్ అయిపోతున్నారు. అగ్ర హీరోలు బాలకృష్ణ, వెంకటేశ్ , నాగార్జున తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్స్ చేసి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

వీళ్లే కాకుండా ఈ జనరేషన్‌లో తండ్రీకొడుకులుగా చాలా మంది హీరోలు డ్యూయెల్ రోల్స్ చేశారు. ఇప్పటి జనరేషన్‌లో ఎన్టీఆర్..‘ఆంధ్రావాలా’, ‘శక్తి’ వంటి సినిమాల్లో తండ్రీకొడుకుగా డ్యూయల్ రోల్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ‘బాహుబలి’ సిరీస్‌లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో మెప్పించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు విషయానికొస్తే..ఎస్.జే.సూర్య దర్శకత్వంలో చేసిన ‘నాని’ సినిమాలో మహేశ్‌ బాబు తండ్రీ కొడుకుగా డ్యూయెల్ రోల్ చేసి అలరించాడు. ‘కిక్2’ లో రవితేజ కూడా తండ్రి కొడుకుగా రెండు పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.