RRR Movie : ఆస్కార్‌కు చేరువలో ‘నాటు నాటు’..ఆ పాటతో టఫ్ ఫైట్..

- Advertisement -

RRR Movie : మనదేశ సినీ ఇండస్ట్రీ సాధించబోయే ఆస్కార్ అవార్డు కోసం ప్రపంచం మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తుంది..దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల అటెన్షన్ క్యాచ్ చేసింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ సహా పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ పాట అవార్డ్స్ సొంతం చేసుకోగా.. తప్పకుండా ఆస్కార్‌‌ను కూడా దక్కించుకుంటుందని యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తుంది..అయితే ఈ క్రమంలోనే ఈ పాట మరికొన్ని పాటలతో పోటీ పడనుంది..

RRR Movie
RRR Movie

వాస్తవానికి ఈ పాట వరల్డ్ వైడ్‌గా 81 పాటలు ఆస్కార్‌కు ఎంట్రీ ఇచ్చాయి. అయితే తుది జాబితాలో చోటు దక్కించుకున్న 15 పాటల్లో ‘నాటు నాటు’ స్థానం దక్కించుకోగా.. ఆ తర్వాత ఆస్కార్ ప్రకటించిన 5 పాటలతో కూడిన షార్ట్ లిస్ట్‌లోనూ బెర్త్ కన్‌ఫర్మ్ చేసుకుంది. మిగతా నాలుగు పాటల విషయానికొస్తే..టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ (అప్లాజ్), ‘హోల్డ్ మై హ్యాండ్’ (టాప్‌గన్: మావెరిక్), ‘లిఫ్ట్ మీ అప్, ‘దిస్ ఈజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్). వీటిలో ఒక్క పాటకు మాత్రమే ఆస్కార్ దక్కనుంది.. అందులో ఫెమస్ పాట రిహానా పాడిన ‘లిఫ్ట్ మీ అప్’ సాంగ్ ‘నాటు నాటు’కు పోటీనిస్తోందని తెలుస్తుంది.

hold my hand

ఆ తర్వాత స్థానాల్లో ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’, స్వయంగా లేడీ గాగా లిరిక్స్ అందించడంతో పాటు పాడిన ‘హోల్డ్ మై హ్యాండ్’ ఉన్నాయి. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రదర్శించిన థియేటర్లో ‘నాటు నాటు’ పాటకు ఫారిన్ ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ‘నాటు నాటు’ ఆస్కార్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.. మరో వైపు ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ మాత్రం తగ్గించలేదు..ఆస్కార్ అవార్డ్స్‌కు సంబంధించి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన తొలి ఇండియన్ సాంగ్‌గా ‘నాటు నాటు’ గుర్తింపు పొందింది.

- Advertisement -
ar rahman for oscars

గతంలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రం కోసం ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన ‘జై హో’ సాంగ్.. బెస్ట్ స్కోర్ కేటిగిరీలో ఆస్కార్ అవార్డ్ పొందింది. కానీ ఈ సినిమాను బ్రిటిష్ ఫిలిం మేకర్స్ రూపొందించడం గమనార్హం. కాగా.. ఇప్పుడు ‘నాటు నాటు’ గనుక ఆస్కార్ అవార్డ్ గెలుపొందితే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టిస్తుంది.. మరి ఎవరికీ ఆస్కార్ వస్తుందో తెలియాంటే కొన్ని గంటలు వెయిట్ చెయ్యాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here