Michael Trailer Review : సందీప్ కిషన్ పాన్ ఇండియా యాక్షన్‌ మూవీ ‘మైఖేల్’ ట్రైలర్ రివ్యూ



Michael Trailer Review : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పక్కా కమర్షియల్ హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడు. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా ఈ హీరో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. తన టాలెంట్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. మూస ధోరణిలో సినిమాలు చేయకుండా.. కెరీర్ ప్రారంభం నుంచి కొత్తగా ఏదో చేయాలనే తపన కనబరుస్తున్నాడు. ఇప్పటికే డజనుకుపైగా సినిమాలు చేసినా.. ఒక్కటీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది.

Michael Trailer Review
Michael Trailer Review

మంచి కమర్షియల్ హిట్ కోసం చాలా ఈగర్‌ వెయిట్ చేస్తున్నాడు సందీప్ కిషన్. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లలోనూ కనిపిస్తున్నాడు. కేవలం తెలుగులో మాత్రమే కాదు హిందీ, తమిళ సినిమాల్లోనూ నటిస్తున్నాడు. మెయిన్ లీడ్‌గానే కాకుండా తన పాత్రకు బలముందనిపిస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘బీరువా’, ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ వంటి పలు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాలే సాధించినా.. సందీప్‌కు మాత్రం స్టార్ స్టేటస్‌ తెచ్చిపెట్టలేకపోయాయి.

రెండేళ్లు గ్యాప్ తీసుకుని ‘మైఖేల్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సందీప్. ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా. రంజిత్‌ జయంకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు టీజర్‌ను నటుడు నాని విడుదల చేయగా ఇతర భాషల్లో మరికొందరు తారలు రిలీజ్‌ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘మైఖేల్‌.. వేటాడటంరాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయ్‌’ అనే సంభాషణతో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఆ డైలాగ్‌కు దీటుగా సందీప్‌ ఇచ్చిన సమాధానం వావ్‌ అనిపించేలా ఉంది. సందీప్‌ లుక్‌, నటన చాలా కొత్తగా ఉన్నాయి. దివ్యాంశ కౌశిక్‌ కథానాయికగా నటిస్తున్న మైఖేల్ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్బృందం విడుదల చేసింది. లేటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

ట్రైలర్‌ మొత్తం యాక్షన్‌ సన్నివేశాలతో కనిపిస్తోంది. ట్రైలర్‌లో సినిమా కంటెంట్‌ను గానీ.. కాన్సెప్ట్‌ను గానీ ఎక్కువగా రివీల్‌ చేయలేదు. మరోవైపు ఈ మూవీలో సందీప్ సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే సందీప్ ఈ మూవీ కోసం బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా స్టోరీ అంతా హీరోయిన్‌ చుట్టూ తిరుగుతుందని మాత్రం ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. మరి హీరోయిన్‌ ఎవరు? అసలు హీరోయిన్‌కు ఏమైంది? హీరోయిన్‌ కోసం సందీప్‌ గ్యాంగ్‌స్టార్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అనే పలు విషయాలను సస్పెన్స్‌లో పెట్టారు.

విజయ్‌ సేతుపతి క్యారెక్టర్‌ పవర్‌ ఫుల్‌గా ఉండనున్నట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. గౌతమ్‌ మీనన్‌ ఇంటెన్వీస్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఇక వరుణ్‌ సందేశ్‌ కొత్తగా కనిపిస్తున్నాడు. వరలక్ష్మీ క్యారెక్టర్‌ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఒక్క ట్రైలర్‌తో ఎక్కడ లేని అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ట్రైలర్‌నూ మీరూ చూసేయండి.